Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్యాంకులకు కుచ్చు టోపీ.. క్వాలిటీ ఐస్‌క్రీమ్స్‌పై శరవేగంగా సీబీఐ దర్యాప్తు

Webdunia
శనివారం, 3 అక్టోబరు 2020 (16:15 IST)
క్వాలిటీ ఐస్ క్రీమ్ కంపెనీ క్వాలిటీ లిమిటెడ్ బ్యాంకులకు టోపి పెట్టింది. కోట్లలో మోసం చేసినట్లు సీబీఐ తెలిపింది. తప్పుడు లెక్కలు చూపించి బ్యాంకుల్లో కోట్లలో రుణాలు పొందాయని గుర్తించారు. ఈ మేరకు కంపెనీకి చెందిన ఎనిమిది మందిని సీబీఐ అధికారులు విచారణ జరిపారు. విచారణలో క్వాలిటీ లిమిటెడ్ చేసిన మోసాలు వెలుగులోకి వచ్చాయి. 
 
క్వాలిటీ లిమిటెడ్ భారత్ బ్యాంకుల్లో రూ.1400 కోట్ల వరకు రుణాన్ని పొందింది. కంపెనీకి సంబంధించిన తప్పుడు పత్రాలను బ్యాంకుకు సమర్పించి కోట్లలో రుణాన్ని పొందింది. కేంద్ర దర్యాప్తు సంస్థ విచారణ జరపడంతో అసలు విసయం బయటకు వచ్చింది. 
 
కంపెనీకి చెందిన ఎనిమిది మందిని సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకుని విచారణ జరిపారు. బ్యాంకు రుణాలు చెల్లించకుండా మోసానికి పాల్పడినట్లు నిర్ధారించారు. ఈ స్కాంలో క్వాలిటీ లిమిటెడ్ డైరెక్టర్లు సంజరు ధింగ్రా, సిద్ధాంత్ గుప్తా, అరుణ్ శ్రీవాస్తవ్ భాగస్వాములుగా కొనసాగుతున్నారు.
 
బ్యాంక్ ఆఫ్ ఇండియా నేతృత్వంలో 10 బ్యాంకుల నుంచి క్వాలిటి లిమిటెడ్ రుణాన్ని పొందింది. అయితే బ్యాంక్ నుంచి తీసుకున్న రుణం చెల్లించడం లేదని 2018 ఆగస్టులో క్వాలిటీ లిమిటెడ్ ఖాతాను నిరర్ధక ఆస్తులుగా ప్రకటించారు. 
 
బీఒబీ ఫిర్యాదు మేరకు సీబీఐ విచారణ కొనసాగించింది. ఈ మేరకు విచారణలో క్వాలిటీ కంపెనీ మొత్తం అమ్మకాలు రూ.13,147.25 కోట్లుగా చూపింది. ఇందులో రూ.7,107.23 కోట్లు మాత్రమే బ్యాంకుల నుంచి రుణం పొందినట్లు ఫోరెన్సిక్ ఆడిట్‌ను సీబీఐకి సమర్పించింది.
 
రివర్స్ ఎంట్రీలు చేసి ఖాతాలను తారుమారు చేసి క్వాలిటీ లిమిటెడ్ వ్యాపార కార్యకలాపాలు నిర్వహించినట్లు బ్యాంక్ ఆప్ ఇండియా ఆరోపించింది. 2018 చివరి నాటికి క్వాలిటీ చాలా బ్యాంకుల నుంచి దాదాపు రూ.1900 కోట్లు అప్పు తీసుకుంది. ఇందులో రూ.520 కోట్లు చెల్లించింది. మిగిలిన డబ్బులు చెల్లించకపోవడంతో బ్యాంకులు ఈ కంపెనీపై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

పెంచల్ రెడ్డి జీవిత కథతో ఆపద్భాంధవుడు చిత్రం: భీమగాని సుధాకర్ గౌడ్

Chiranjeevi: చిరంజీవితో విశ్వంభర లో సత్యలోకం చూపిస్తున్న వసిష్ఠ

Gautham Tinnanuri: దర్శకుడు గౌతమ్ తిన్ననూరి డైలమాలో వున్నారా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

తర్వాతి కథనం
Show comments