Webdunia - Bharat's app for daily news and videos

Install App

కార్పొరేట్ ఏజెన్సీ ఒప్పందంలోకి ప్రవేశించిన కేర్ హెల్త్ ఇన్సూరెన్స్, ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్

Webdunia
గురువారం, 14 డిశెంబరు 2023 (17:28 IST)
అత్యంత గౌరవనీయమైన చిన్న ఫైనాన్స్ బ్యాంక్‌లలో ఒకటైన ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, దేశంలోని ప్రముఖ స్పెషలైజ్డ్ హెల్త్ ఇన్సూరెన్స్‌ సంస్థలలో ఒకటైన కేర్ హెల్త్ ఇన్సూరెన్స్‌తో కార్పొరేట్ ఏజెన్సీ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ కార్యక్రమంలో ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ బ్రాంచ్ బ్యాంకింగ్, సీనియర్ ప్రెసిడెంట్, కంట్రీ హెడ్ శ్రీ మురళీ వైద్యనాథన్, కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ హెచ్‌ఆర్ & రిస్క్ - హెడ్ చౌదరి చంద్రకాంత మిశ్రా పాల్గొన్నారు.
 
ఈ భాగస్వామ్యంతో, ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ తమ విస్తృత స్థాయి కస్టమర్ బేస్‌కి కేర్ హెల్త్ యొక్క ప్రత్యేకమైన, వినూత్నమైన ఆరోగ్య బీమా పరిష్కారాలను అందిస్తుంది. ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ కస్టమర్‌లకు రిటైల్, గ్రూప్ సెగ్మెంట్‌లలో ఉత్పత్తులు అందించబడతాయి. ఈ భాగస్వామ్యంపై కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ హెచ్‌ఆర్&రిస్క్- హెడ్ చౌదరి చంద్రకాంత మిశ్రా మాట్లాడుతూ, “భారతదేశంలో అత్యంత విశ్వసనీయమైన బ్యాంకులలో ఒకటైన ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌తో భాగస్వామ్యం కావడం పట్ల మేము సంతోషిస్తున్నాము. ఇది ఆర్థిక చేరికను ప్రోత్సహించడమే కాదు, నాణ్యమైన సర్వీసింగ్‌తో కూడిన సమగ్ర ఆరోగ్య బీమా పరిష్కారాలను అందించడం ద్వారా నాణ్యమైన ఆరోగ్య సంరక్షణను దాని వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది" అని అన్నారు. 
 
ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ సీనియర్ ప్రెసిడెంట్, బ్రాంచ్ బ్యాంకింగ్ కంట్రీ హెడ్ మురళీ వైద్యనాథన్ మాట్లాడుతూ, “ఈక్విటాస్‌లో, ఆరోగ్య బీమా అనేది ప్రతి ఒక్కరికీ ఉండాల్సిన అవసరం ఉందని, అది కుటుంబంలోని ప్రతి ఒక్కరినీ  కవర్ చేయాలని మేము దృఢంగా విశ్వసిస్తున్నాము. కేర్ హెల్త్ ఇన్సూరెన్స్‌తో మా భాగస్వామ్యం తరచుగా ఆరోగ్య అత్యవసర పరిస్థితులతో ముడిపడి ఉన్న ఆర్థిక భారాన్ని తగ్గిస్తుంది. మా కస్టమర్‌లు సరసమైన ధరలకు ఉత్తమమైన ఆరోగ్య సంరక్షణను పొందగలరని నిర్ధారిస్తుంది" అని అన్నారు 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓ హీరో ఇబ్బందికరంగా ప్రవర్తించారు.. : సినీ నటి ఖుష్బూ

డిసెంబర్ నుంచి స్ట్రీమింగ్ కానున్న హరికథ వెబ్ సిరీస్

ఖర్చుపెట్టినా దక్కని ఫలితంతో ఎస్కేప్ అయిన నిర్మాత

ఎస్ఎస్ థమన్ లాంచ్ చేసిన అల్లరి నరేష్, అమృత అయ్యర్ బచ్చల మల్లి మెలోడీ సాంగ్

కన్నప్ప లో మహాదేవ శాస్త్రిగా మోహన్ బాబు లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

క్యాబేజీతో బిర్యానీ.. పెరుగు పచ్చడితో టేస్ట్ చేస్తే.. అదిరిపోతుంది...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

తర్వాతి కథనం
Show comments