Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉద్యోగులకు శుభవార్త... పీఎఫ్ కొత్త స్కీమ్.. రూ.22,810 కోట్ల కేటాయింపు

Webdunia
గురువారం, 10 డిశెంబరు 2020 (14:51 IST)
ఉద్యోగులకు శుభవార్త. కేంద్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ మీటింగ్‌లో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆత్మనిర్భర్ భారత్ రోజ్‌గర్ యోజన స్కీమ్‌కు ఆమోదం తెలిపారు. దీంతో ఉద్యోగులకు బెనిఫిట్ కలుగనుంది. కేంద్ర ప్రభుత్వం ఈ స్కీమ్ కోసం ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రూ.1,584 కోట్లు కేటాయించింది. 
 
2020-2023 కాలానికి గానూ రూ.22,810 కోట్లు కేటాయించింది. ఈ స్కీమ్‌లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు సబ్సిడీ బెనిఫిట్ అందిస్తుంది. కొత్తగా ఉద్యోగంలోకి చేరిన వారికి మోదీ సర్కార్ రెండేళ్ల పాటు పీఎఫ్ సబ్సిడీ అందిస్తుంది. 1,000 వరకు ఉద్యోగులు ఉన్న కంపెనీలు కొత్త ఉద్యోగులను నియమించుకుంటే.. అప్పుడు కేంద్ర ప్రభుత్వమే 24 శాతం పీఎఫ్ కంట్రిబ్యూషన్ చెల్లిస్తుంది. 
 
ఇందులో ఉద్యోగి వాటా 12 శాతం, కంపెనీ వాటా 12 శాతం. అయితే ఇక్కడ ఉద్యోగి వేతనం రూ.15,000లోపు ఉండాలి. అదే 1,000కి పైగా ఉద్యోగులు ఉన్న కంపెనీలు కొత్తగా ఉద్యోగులను నియమించుకుంటే.. అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఉద్యోగి పీఎఫ్ కంట్రిబ్యూషన్ 12 శాతాన్ని చెల్లిస్తుంది. 
 
అక్టోబర్ 1 నుంచి వచ్చే ఏడాది జూన్ 30 వరకు ఉద్యోగాల్లోకి తీసుకున్న వారికి ఈ స్కీమ్ వర్తిస్తుంది. వీరందరికీ రెండేళ్లపాటు పీఎఫ్ డబ్బులను కేంద్రమే చెల్లిస్తుంది. దీంతో ఉద్యోగుల చేతికి ఎక్కువ వేతనం లభిస్తుంది.

సంబంధిత వార్తలు

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments