బీఎస్ఎన్ఎల్ బంపర్ ఆఫర్... ఒక ఏడాది ఉచితంగా..

Webdunia
బుధవారం, 13 ఫిబ్రవరి 2019 (12:51 IST)
మార్కెట్‌లో వివిధ టెలికాం సంస్థల పోటీని తట్టుకుంటూ ఎలాగైనా తమ వినియోగదారుల సంఖ్యను పెంచుకోవడానికి ఆరాటపడుతోంది ప్ర‌భుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్. ఇప్పటికే పలు రకాల ఆఫర్‌లతో రిలయన్స్ జియోకు సైతం గట్టి పోటీ ఇస్తున భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ తాజాగా కొత్త ఆఫర్‌తో ముందుకొచ్చింది. 
 
భారత్ ఫైబర్ తమ వినియోగదారులకు ఏడాది పాటు రూ. 999 విలువైన అమెజాన్ ప్రైమ్ మెంబ‌ర్‌షిప్‌ను ఉచితంగా అందిస్తున్న‌ట్లు ప్రకటించింది. కానీ ఈ ఆఫర్ భార‌త్ ఫైబ‌ర్ బ్రాడ్‌బ్యాండ్‌లో రూ.777 (18జీబీ) మరియు అంతకన్నా ఎక్కువ విలువైన ప్లాన్‌లను వినియోగిస్తున్నవారికి మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. అర్హత ఉన్న వినియోగ‌దారులు బీఎస్ఎన్ఎల్ వెబ్‌సైట్‌కి వెళ్లి ఈ ఆఫర్‌ను పొందవచ్చు. 
 
ఇప్పటికే భారతదేశంలో అమెజాన్‌ ప్రైమ్‌ సేవలు విస్తృతంగా వ్యాపిస్తున్నాయి, అలాగే దీని వీక్షకులు కూడా పెరుగుతున్న నేపథ్యంలో ఈ ఆఫర్ పట్ల చాలామంది భారతీయులు ఆసక్తి చూపుతున్నారు. వినియోగదారుల ప్రాధాన్యతలను అర్థం చేసుకుని, వారి అభిరుచికి అనుగుణంగా ఈ ఆఫర్‌ను ప్రకటించామని బిఎస్ఎన్ఎల్ డైరెక్టర్, సీఈవో వివేక్ బంజల్ చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సుడిగాలి సుధీర్ గోట్ దర్శకుడుపై నటి దివ్యభారతి ఆరోపణ

Priyadarshi: నాకేం స్టైల్ లేదు, కొత్తగా చేస్తేనే అది మన స్టైల్ : ప్రియదర్శి

అఖిల్ మరో దేవరకొండ.. తేజస్వినీలో సాయి పల్లవి కనిపించింది : వేణు ఊడుగుల

Allari Naresh: హీరోయిన్ పై దోమలు పగబట్టాయి : అల్లరి నరేశ్

నిర్మాతగా స్థాయిని పెంచే చిత్రం మఫ్టీ పోలీస్ : ఎ. ఎన్. బాలాజి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments