Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇక అంతర్జాతీయ ఉచిత వైఫై.. 100 దేశాల్లో 4,4 కోట్ల బీఎస్ఎన్ఎల్ హాట్ స్పాట్లు

ఇంతవరకు దేశంలోపలి ఖాతాదారులకు ఉచిత సేవలను అందించడంలో పోటీ పడిన టెలికామ్ సంస్థలు ఇప్పుడు విదేశాల్లో ఉన్న భారతీయులకు సేవలందించడంలోనూ పోటీ పడుతున్నాయి. రియో దెబ్బకు విలవిల్లాడుతున్న బీఎస్ఎన్ఎల్ తాజాగా అంతర్జాతీయంగా ఉచిత వైఫై అంటూ రంగంమీదికి వచ్చేసింది.

Webdunia
శనివారం, 14 జనవరి 2017 (02:57 IST)
రిలయెన్స్ జియో ఉచిత సేవల ప్రకంపనలు ఇంకా టెలికామ్ సంస్థలను వెంటాడుతూనే ఉన్నాయి. జియో పుణ్యమా అని దేశంలోని వివిధ టెలికామ్ సంస్థలు కస్టమర్లను ఆకట్టుకోవడంలో, ఉన్నవారిని నిలుపుకోవడంలో కొత్త పుంతలు తొక్కుతున్నారు. ఇంతవరకు దేశంలోపలి ఖాతాదారులకు ఉచిత సేవలను అందించడంలో పోటీ పడిన టెలికామ్ సంస్థలు ఇప్పుడు విదేశాల్లో ఉన్న భారతీయులకు సేవలందించడంలోనూ పోటీ పడుతున్నాయి. రియో దెబ్బకు విలవిల్లాడుతున్న బీఎస్ఎన్ఎల్ తాజాగా అంతర్జాతీయంగా ఉచిత వైఫై అంటూ రంగంమీదికి వచ్చేసింది. 
 
దేశీయ టెలికం దిగ్గజం భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బిఎస్ఎన్ఎల్) శుక్రవారం మరో బంపర్ ఆఫర్ ప్రకటించింది.  బీఎస్ఎన్ఎల్  చందాదారులకు  అంతర్జాతీయంగా ఉచిత వైఫై సదుపాయాన్ని కల్పిస్తోంది. తన వినియోగదారులకు అపూర్వమైన  డాటా అనుభవాన్ని అందించే  క్రమంలో టాటా కమ్యూనికేషన్స్ తో ఒక ఒప్పందం కుదుర్చుకుంది.
హై క్వాలిటీ, వేగవంతమైన  డాటా అందించేలా  టాటా కమ్యూనికేషన్స్ తో వై ఫై,  వైఫై క్లౌడ్ కమ్యూనికేషన్స్ కో్సం ఒక భాగస్వామ్యాన్ని బీఎస్ఎన్ఎల్ ప్రకటించింది. 
 
దాదాపు 100కు పైగా దేశాల్లో 4.4 కోట్ల (44మిలియన్ల) వై ఫై హాట్ స్పాట్లను ఏర్పాటు చేయనుంది.  అంతర్జాతీయ విమానాలు, రైల్వేలతో సహా ఈ సర్వీసులను అందుబాటులోకి తేనున్నట్టు టాటా కమ్యూనికేషన్స్ బీఎస్ఈ  ఫైలింగ్ లో తెలిపింది. టాటా కామ్ బిఎస్ఎన్ఎల్ చందాదారులు భారతదేశం వెలుపల ప్రయాణంలో ఉన్నప్పుడు ప్రపంచంలో  వైఫై  నెట్వర్కుకు  అనుమతి ఉంటుందని తెలిపింది. అంతేకాదు వివిధ పాస్‌వర్డ్‌లను గుర్తుంచుకోవడంలో గజిబిజి లేకుండానే....వై ఫై  హాట్ స్పాట్ కు ఒక్కసారి నమోదు  అయితే చాలని  చెప్పింది.  దీంతో వారు వేరు వేరు నగరం, దేశం లేదా ఖండం ఎక్కడున్నా  సమీపంలోని  వైఫైకి ఆటోమేటిగ్గా కనెక్ట్  అవుతారని  టాటా కామ్  వెల్లడించింది.
 
ప్రపంచంలో్ ఎక్కడున్న బిఎస్ఎన్ఎల్ మొబైల్ వినియోగదారుల  బిల్లు షాక్ గురించి చింతలేకుండా ఇంటర్నెట్ అనుభూతిని అందించడమే తమలక్ష్యమని మేనేజింగ్ డైరెక్టర్, ఛైర్మన్ అనుపమ్ శ్రీవాత్సవ తెలిపారు.

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments