Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీఎస్ఎల్ఎల్ సరికొత్త ఆఫర్ల వివరాలు

దేశంలో టెలికాం కంపెనీల మధ్య పోటీ తీవ్ర స్థాయికి చేరింది. దీంతో ప్రైవేట్ టెలికాం కంపెనీల నుంచి ఎదురవుతున్న ఒత్తిడిని తట్టుకునేందుకు ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎస్ఎల్ వివిధ రకాల ఆఫర్లతో ముందుకువస్త

Webdunia
ఆదివారం, 5 నవంబరు 2017 (09:53 IST)
దేశంలో టెలికాం కంపెనీల మధ్య పోటీ తీవ్ర స్థాయికి చేరింది. దీంతో ప్రైవేట్ టెలికాం కంపెనీల నుంచి ఎదురవుతున్న ఒత్తిడిని తట్టుకునేందుకు ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎస్ఎల్ వివిధ రకాల ఆఫర్లతో ముందుకువస్తోంది. తాజాగా, ఉన్నవారితో పాటు కొత్త వినియోగదారులను ఆకర్షించేందుకు పలు ఆఫర్లు ప్రకటించింది. 
 
ముఖ్యంగా ప్రీపెయిడ్‌ కస్టమర్లను దృష్టిలో పెట్టుకుని 'లూట్‌ లో' పేరుతో రీఛార్జ్‌ ప్యాక్‌లను తీసుకొచ్చింది రూ.29, రూ.39, రూ.198, రూ.249, రూ.429, రూ.549 రీఛార్జ్‌ ప్యాక్‌లను ప్రవేశపెట్టింది. అంతేకాకుండా రూ.4కే మొబైల్‌ డేటాను సైతం ఇస్తోంది. 
 
రూ.429తో రీఛార్జ్‌ చేసుకుంటే రోజుకు 1జీబీ చొప్పున 90 రోజుల పాటు డేటా లభించనుంది. రూ.29తో 150 ఎంబీ డేటా (మూడురోజులు) అందించనుంది. అయితే ఇది సర్కిల్‌ను బట్టి రూ.33 వరకూ ఉంటుందని తెలిపింది. 
 
ఇక రూ.39కే 200 ఎంబీ డేటా ఐదురోజుల వ్యాలిడిటీతో అందిస్తోంది. రూ.198 రీఛార్జ్‌ ప్లాన్‌తో 25 రోజుల కాల పరిమితికి 2.2జీబీ మొబైల్‌ డేటాను ఇవ్వనుంది. రూ.4,498కి 160 జీబీ డేటాను 365 రోజుల పాటు వినియోగించుకోవచ్చు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శుభ్ మన్ గిల్‌తో ప్రగ్యా జైశ్వాల్ ప్రేమ.. నిజమెంత?

రాబిన్‌హుడ్ తో ఈ క్రిస్మస్ మాదే : హీరో నితిన్

శ్రీ గాంధారిగా భయపెట్టించేందుకు వస్తున్న హన్సిక

ముఫాసా: ది లయన్ కింగ్ నుంచి ముఫాసా ప్రయాణంతో షారుఖ్ ఖాన్

వెంకటేష్, ఐశ్వర్య రాజేష్ లపై వెన్నెల రాత్రి నేపథ్యంలో సాంగ్ చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments