Webdunia - Bharat's app for daily news and videos

Install App

మళ్లీ పుంజుకున్న బిట్ కాయిన్... రికార్డు స్థాయిలో పెరిగిన ధర

Webdunia
మంగళవారం, 28 మే 2019 (18:07 IST)
ఒకదశలో ఇన్వెస్టర్లను దివాళా స్థాయికి దిగజార్చిన బిట్‌కాయిన్‌ ఇప్పుడు మళ్ళీ పుంజుకుంది. 2017లో గరిష్ఠ స్థాయికి చేరిన బిట్‌ కాయిన్‌ ధర తర్వాత భారీగా క్షీణించింది. అప్పటి నుంచి అంటే గడచిన రెండేళ్ళ కాలంలో ఈ నెలలో బిట్‌కాయిన్‌ ధర రికార్డు స్థాయిలో పెరిగింది. సోమవారం 10 శాతం పెరిగిన బిట్ కాయిన్ ధర 9000 డాలర్లకు చేరింది.
 
మరోవైపు బిట్‌ కాయిన్‌ మార్కెట్‌లో ప్రవేశించనున్నట్లు ఫేస్‌బుక్‌ వెల్లడించిన నేపథ్యంలో ఏటీ అండ్ టీ కూడా కొత్త నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి తమ నెట్‌‌వర్క్‌ ద్వారా బిట్‌కాయిన్స్‌లో బిల్లులు చెల్లించేందుకు అనుమతించనున్నట్లు ఏటీ అండ్ టీ వెల్లడించింది. 
 
అనేక బ్రోకింగ్‌ సంస్థలు బిట్‌ కాయిన్‌ భవిష్యత్తు గురించి ఆందోళన వ్యక్తం చేసినప్పటికీ కేవలం ఒకే ఒక్క నెలలో బిట్ కాయిన్‌ దాదాపు 70 శాతం పెరిగింది. అనేక అంతర్జాతీయ సంస్థలు, బహుళ జాతి కంపెనీలు బిట్‌ కాయిన్‌ను తీసుకునేందుకు అంగీకరిస్తుండటంతో బిట్‌ కాయిన్‌ పట్ల జనాల్లో ఆసక్తి పెరుగుతోంది.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments