Webdunia - Bharat's app for daily news and videos

Install App

2 గంటల్లో హోమ్‌ డెలివరీ సేవలు: స్టెప్‌ ఔట్‌ ఇన్‌ స్టైల్‌కు విస్తరించిన బిగ్‌బజార్‌

Webdunia
బుధవారం, 14 జులై 2021 (21:36 IST)
తమ 2 గంటల్లో హోమ్‌ డెలివరీ సేవలు అపూర్వ విజయం సాధించిన తరువాత బిగ్‌ బజార్‌ మరియు ఎఫ్‌బీబీలు ఈ సేవలను ఇప్పుడు ‘స్టెప్‌ ఔట్‌ ఇన్‌ స్టైల్‌’ శీర్షికన నూతనంగా ఆవిష్కరించిన ఫ్యాషన్‌ కలెక్షన్‌కు సైతం విస్తరించింది. వినియోగదారులు ఇప్పుడు ఈ నూతన ఫ్యాషన్‌ కలెక్షన్‌ను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయడంతో పాటుగా కేవలం రెండు గంటలలో తమ ఇంటి ముంగిటనే వాటిని డెలివరీ తీసుకోవచ్చు.
 
ఫ్యాషన్‌ కోసం పరిశ్రమలో కేవలం 2 గంటలలో హోమ్‌ డెలివరీ సేవలను అందిస్తున్న ఒకే ఒక్క సంస్థ బిగ్‌బజార్‌, ఎఫ్‌బీబీ. ఆన్‌లైన్‌ ద్వారా తమ ఆర్డర్లను అందించిన వినియోగదారులకు ఈ సేవలను అందిస్తుంది. దేశవ్యాప్తంగా అన్‌లాక్‌ ప్రక్రియ జరుగుతున్న వేళ, అధికశాతం మంది భారతీయులు టీకా తీసుకోవడంతో పాటుగా ప్రయాణ మరియు పని అవసరాల కోసం బయటకు వస్తున్నారు. ఈ నూతన ఫ్యాషన్‌ కలెక్షన్‌ దేశ వ్యాప్తంగా 144 నగరాలలో 325 బిగ్‌బజార్‌ స్టోర్ల వద్ద లభ్యమవుతుంది.
 
ఈ కార్యక్రమం గురించి పవన్‌ సార్డా, సీఎంఓ- డిజిటల్‌, మార్కెటింగ్‌ అండ్‌ ఈ-కామర్స్‌, ఫ్యూచర్‌ గ్రూప్‌ మాట్లాడుతూ, ‘‘షాప్‌లో ఏ విధమైన అనుభవాలను పొందుతారో అదే తరహాలో ఆన్‌లైన్‌లో కూడా ఆహ్లాదకరమైన అనుభవాలను ఒక్క బటన్‌ టచ్‌ చేయడం ద్వారా పొందే అనుభూతులను అందిస్తున్నాం. వినియోగదారులు సురక్షితంగా తమ ఇళ్ల వద్దనే ఉండటంతో పాటుగా రెండు గంటలలోనే డెలివరీ సైతం పొందవచ్చు.
 
మేము మా వినియోగదారులకు  అందుబాటు ధరలలో అంతర్జాతీయంగా తాజా ధోరణులను ప్రదర్శించడం ద్వారా ట్రెండింగ్‌ అనుభవాలను అందించాలని కోరుకుంటున్నాం’’ అని అన్నారు. ఈ నూతన ఫ్యాషన్‌ కలెక్షన్‌ 299 రూపాయల నుంచి ఆరంభమవుతుంది. విస్తృత శ్రేణిలో డ్రెస్‌లు, టునిక్స్‌, పలోజ్జోలు, టాప్స్‌, పోలో టీ, షర్ట్స్‌, షార్ట్స్‌ను వినియోగదారులు ఎంచుకోవచ్చు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దక్షిణాదిలో సమంత రీ ఎంట్రీ గ్రాండ్‌గా వుండబోతోంది.. చెర్రీ, పుష్పలతో మళ్లీ రొమాన్స్!?

Sharwanand: తమన్నా ని హీరోయిన్ అని పిలవడం ఇష్టం లేదు : శర్వానంద్

Maheshbabu: వెకేషన్ నుంచి తిరిగి హైదరాబాద్ వచ్చిన మహేష్ బాబు

ఎంతో మందితో కలిసి పని చేసినా.. కొంతమందితోనే ప్రత్యేక అనుబంధం : తమన్నా

Nani: వైలెన్స్ సినిమాలున్న దేశాల్లో క్రైమ్ రేట్ తక్కువ, కానీ ఇక్కడ మన బుద్ధి సరిగ్గా లేదు : నాని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

తర్వాతి కథనం
Show comments