Webdunia - Bharat's app for daily news and videos

Install App

పండగ వేళ బంగారం ప్రియులకు చేదువార్త

Webdunia
బుధవారం, 5 అక్టోబరు 2022 (11:37 IST)
పండగ వేల బంగారం ప్రియులకు ఇది నిజంగానే చేదువార్త. భారత్‌కు చేసే బంగారం సరఫరాలో విదేశీ బ్యాంకుల కోత విధించబోతున్నాయనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీనికి చైనా, తుర్కి దేశాలే ప్రధాన కారణంగా ఉంది. బంగారం సఫరా చేయడం వల్ల వచ్చే ఆదాయం భారత్‌తో పోల్చితే చైనా, తుర్కిమెనిస్థాన్ దేశాల నుంచి అధికంగా వస్తున్నట్టు పేర్కొన్నాయి. 
 
సాధారణంగానే పండగ సీజన్‌లో భారత్‌లో పసిడికి గిరాకీ ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో సరఫరాలో కోత విధించడం ఆందోళన కలిగించే విషయం. దేశీయ అవరాల నిమిత్తం ఇక్కడి విక్రేతలు అధిక ప్రీమియంతో బంగారాన్ని కొనుగోలు చేయాల్సిన పరిస్థితి అనివార్యమవుతుంది. ఇదే జరిగితే ఈ పండగ సీజన్‌లో పసిడి ధరలు గణనీయంగా పెరగొచ్చని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
 
భారత్‌కు ఐసీబీసీ స్టాండర్డ్ బ్యాంక్‌, జేపీ మోర్గాన్‌, స్టాండర్డ్‌ ఛార్టెర్డ్‌ ప్రధానంగా బంగారాన్ని సరఫరా చేస్తుంటాయి. సాధారణంగా ఈ సంస్థలు పండగ సీజన్‌కు ముందు భారీ ఎత్తున పసిడిని దిగుమతి చేసుకొని నిల్వ చేసుకుంటుంటాయి. ఈ సమయానికి వీరి వద్ద టన్నుల కొద్దీ బంగారం ఉండాలి. కానీ, ప్రస్తుతం కొన్ని వందల కిలోల నిల్వలు మాత్రమే ఉన్నాయని ఓ అధికారి తెలిపారు. దీనిపై ఆయా బ్యాంకులు ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటనా చేయలేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'గేమ్ ఛేంజర్' నుంచి మరో లిరికల్ సాంగ్.. ఎలావుందంటే?(Video)

నాకోసం పోలీసులు వెతుకుతున్నారా? 26 పాయింట్లతో రాంగోపాల్ వర్మ భారీ ట్వీట్

మాలీవుడ్ ప్రేక్షకులకు ఇచ్చే అతిపెద్ద బహుమతి ఇదే : అల్లు అర్జున్

కోర్టు డ్రామా నేపథ్యంగా సాగే ఉద్వేగం మూవీ రివ్యూ

సమంత "రాణి"గా అభివర్ణించిన శ్రీలీల.. ఎందుకో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

తర్వాతి కథనం
Show comments