Webdunia - Bharat's app for daily news and videos

Install App

Vayve Eva Solar Car: సోలార్ పవర్‌తో కారు.. ధర రూ. 3.25 లక్షలు.. ఫీచర్లు ఏంటో తెలుసా?

సెల్వి
శనివారం, 18 జనవరి 2025 (20:37 IST)
EVA
ప్రస్తుతం, భారతదేశంలో 49 విద్యుత్ కార్లు అమ్మకానికి ఉన్నాయి. వీటిలో, వేవ్ మొబిలిటీ ఈవిఏ చౌకైన ఈవి, వేవ్ మొబిలిటీ ఈవిఏ భారతదేశంలో అత్యంత ధరతో కూడిన విద్యుత్ కారు. తాజాగా సోలార్‌ పవర్‌తోనూ నడిచే కారు కూడా వచ్చేసింది. పెరుగుతున్న పెట్రోల్ ధరలకు స్వస్తి చెప్పే రకంగా సోలార్ కారు ప్రస్తుతం భారత మార్కెట్లోకి అడుగు పెట్టనుంది. సోలార్ కారు ద్వారా పెట్రోల్, డీజిల్ అవసరం ఏమీ వుండదు. ఈవీ కార్లకు కూడా డిమాండ్ పడిపోవచ్చు. ఇప్పటికే కార్లను కొనుగోలు చేసేందుకు పెద్దగా వినియోగదారులు ఆసక్తి చూపట్లేదు. ఇందుకు కారణం ఇంధన ధరల పెరుగుదలే. 
 
ఇలాంటి పరిస్థితుల్లో ఢిల్లీలో జరుగుతున్న భారత్‌ మొబిలిటీ గ్లోబల్‌ ఎక్స్‌పో 2025లో వేవ్‌ మొబిలిటీ (Vayve Mobility) శనివారం సోలార్ పవర్‌తో నడిచే తన ఇవా (Eva) కారును ఆవిష్కరించింది. వేవ్‌ ఇవా (Vayve Eva) కారు మూడు వేరియంట్లు - నోవా (Nova), స్టెల్లా (Stella), వెగా (Vega) వేరియంట్లలో లభిస్తుంది. 
 
ఈ కారు ధర రూ.3.25 లక్షలు (ఎక్స్‌ షోరూమ్‌) ఉంటుంది. అంటే కారు ధర రూ.6 లక్షల వరకూ పలుకుతుందని భావిస్తున్నారు. ఈ ధరలు తొలి 25 వేల మంది కస్టమర్లకు మాత్రమే పరిమితం అని వేవ్‌ (Vayve) తెలిపింది. మోడర్న్‌ ఫ్యామిలీకి కోసం ఇన్నోవేషన్‌తో రూపొందించిన అర్బన్ వెహికల్‌ ఇది అని వేవ్ మొబిలిటీ సీఈఓ కం కో ఫౌండర్ నీలేశ్‌ బజాజ్‌ చెప్పారు.
 
ఫీచర్లు
ఖర్చులు తగ్గించేలా లైట్‌ వెయిట్‌ డిజైన్‌
సింగిల్‌ చార్జింగ్‌తో 250 కి.మీ దూరం ప్రయాణిస్తుంది.
అదనంగా 3,000 కి.మీ దూరం ప్రయాణించగల సామర్థ్యం కలిగి వుంటుంది. 
వేవ్‌ ఇవా కారు హై ఓల్టేజ్‌ పవర్‌ట్రైన్‌ మోటారుతో వస్తోంది.
స్మార్ట్‌ ఫోన్‌ ఇంటిగ్రేషన్‌,
ఓవర్‌ ది ఎయిర్ (ఓటీఏ) అప్‌డేట్స్‌, 
రిమోట్‌ మానిటరింగ్‌, 
వెహికల్‌ డయాగ్నిసిస్‌ వంటి ఫీచర్లు వుంటాయి. 
సూపర్‌ ఫాస్ట్‌ చార్జింగ్‌ సామర్థ్యంతో కేవలం ఐదు నిమిషాల చార్జింగ్‌తో 50 కి.మీ దూరం అదనంగా ప్రయాణించవచ్చు.
 
ఇకపోతే.. ముందస్తు బుకింగ్‌ కోసం రూ.5వేలు చెల్లించి రిజిస్టర్ చేసుకోవాలి. డెలివరీ మాత్రం 2026లో ప్రారంభం అవుతాయి. ఈ కారు విద్యుత్ శక్తితో పాటు సోలార్‌తో నడుస్తుంది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పనిచేసే యువతితో సైఫ్ అలీఖాన్ రాసలీలలు, కోపమొచ్చి పొడిచిన ప్రియుడు?!!

కిరణ్ అబ్బవరం దిల్ రూబా నుంచి సింగిల్ అగ్గిపుల్లె..రిలీజ్

ముగ్గురు కాలేజీ స్నేహితుల కథతో మ్యాడ్ స్క్వేర్ రాబోతోంది

నాస్తికులు-ఆస్తికులు అనే కాన్సెప్ట్‌ తో కన్నప్ప రూపొందింది : చిత్ర యూనిట్

తల్లి మనసు లాంటి చిత్రాలను ఆదరిస్తే మరిన్ని వస్తాయి: ముత్యాల సుబ్బయ్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారతదేశంలో సామ్‌సంగ్ హెల్త్ యాప్‌లో వ్యక్తిగత ఆరోగ్య రికార్డుల ఫీచర్‌ను ప్రవేశపెట్టిన సామ్‌సంగ్

యూరిక్ యాసిడ్ ఎలా తగ్గించుకోవాలి?

HMPV వ్యాధి నిరోధించేందుకు చిట్కాలు

శిశువు గుండె భాగంలోకి వెళ్లిపోయిన లివర్, కిడ్నీలు, పేగులు: ప్రాణాల‌ను కాపాడిన లిటిల్ స్టార్- షీ ఉమెన్- చిల్డ్రన్ హాస్పిటల్‌

కిడ్నీలను డ్యామేజ్ చేసే అలవాట్లు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments