Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్యాంకుల వద్ద రద్దీ.. ఏటీఎంల 'అవుట్ ఆఫ్ సర్వీస్'.. ఖాతాదారుల గగ్గోలు...

పాత కరెన్సీ నోట్లను మార్చుకునేందుకు ప్రజలు బ్యాంకులకు క్యూ కడుతున్నారు. దీంతో రెండో రోజు ఉదయం నుంచి అన్ని బ్యాంకుల వద్ద రద్దీ కనిపిస్తోంది. అదేసమయంలో మూడో రోజు కూడా ఏటీఎం కేంద్రాలు తెరుచుకోలేదు. ఈ కార

Webdunia
శుక్రవారం, 11 నవంబరు 2016 (09:23 IST)
పాత కరెన్సీ నోట్లను మార్చుకునేందుకు ప్రజలు బ్యాంకులకు క్యూ కడుతున్నారు. దీంతో రెండో రోజు ఉదయం నుంచి అన్ని బ్యాంకుల వద్ద రద్దీ కనిపిస్తోంది. అదేసమయంలో మూడో రోజు కూడా ఏటీఎం కేంద్రాలు తెరుచుకోలేదు. ఈ కారణంగా ఖాతాదారులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు.
 
దేశంలో రూ.500, రూ.1000 నోట్లను రద్దుచేసి, కొత్త నోట్లను జారీ చేస్తున్న విషయం తెల్సిందే. ఇందుకోసం రెండు రోజుల పాటు ఏటీఎం కేంద్రాలను మూసివేయగా, ఒక రోజు బ్యాంకు సేవలను బంద్ చేశారు. 
 
ఈ నేపథ్యంలో బ్యాంకులు, పోస్టాఫీసుల్లో గురువారం నుంచి కొత్త నోట్ల పంపిణీ ప్రారంభమైంది. శుక్రవారమైన రెండో రోజు కూడా ఇదే పరిస్థితి నెలకొంది. తమ వద్ద ఉన్న చెల్లని పాత నోట్లను మార్చుకునేందుకు జనాలు బ్యాంకులకు పరుగులు తీస్తున్నారు. 
 
మరోవైపు.. బుధ, గురువారాల్లో మూతపడిన ఏటీఎం కేంద్రాలు శుక్రవారం ఉదయం కూడా తెరుచుకోలేదు. ఏటీఎం కేంద్రాల్లోని యంత్రాల్లో కొత్త నోట్లను భర్తీ చేయకపోవడంతో ఏటీఎం కేంద్రాల షెట్టర్లు తెరుచుకోలేదు. 
 
దీనికి కారణం లేకపోలేదు. అన్ని ఏటీఎంలలో కొత్త కరెన్సీని నింపే పనులు పూర్తి కాకపోవడం, నింపిన వాటిల్లో సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ కాకపోవడం వంటి సాంకేతిక కారణాల కారణంగా ఆ పరిస్థితి ఉత్పన్నమైంది. 
 
దీంతో పొద్దున్నే నిత్యావసరాల నిమిత్తం చిల్లర తీసుకోవాలని ఏటీఎంలకు వెళ్లిన వారిని మూసివున్న తలుపులు 'అవుట్ ఆఫ్ సర్వీస్' అన్న బోర్డులు వెక్కిరిస్తున్నాయి. విషయం తెలీని ప్రజలు ఏటీఎంల వద్ద భారీ ఎత్తున క్యూ కడుతున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కింగ్‌డమ్ నుండి విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ బొర్సె ముద్దులతో హృదయం పాట ప్రోమో

కింగ్ జాకీ - క్వీన్ యూనిక్ యాక్షన్ మూవీ: దీక్షిత్ శెట్టి

త్రీ రోజెస్ సీజన్ 2 నుంచి కుషిత కల్లపు గ్లింప్స్ రిలీజ్

జ్యోతి పూర్వజ్ సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీ కిల్లర్ గ్లింప్స్ రిలీజ్

రజనీకాంత్ 'జైలర్-2'లో 'లెజెండ్' బాలకృష్ణ? - నెట్టింట వైరల్!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవిలో మహిళలు ఖర్జూరాలు తింటే ఏంటి ఫలితం?

నిమ్మ కాయలు నెలల తరబడి తాజాగా నిల్వ చేయాలంటే?

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

తర్వాతి కథనం
Show comments