Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖపట్నంలో ప్రత్యేక స్టోర్‌ను ప్రారంభించిన అసుస్‌

Webdunia
శనివారం, 3 సెప్టెంబరు 2022 (23:43 IST)
దేశవ్యాప్తంగా బ్రాండ్‌ యొక్క వాణిజ్య కార్యకలాపాలను మరింత విస్తరించడంలో భాగంగా తైవనీస్‌ సాంకేతిక సంస్థ అసుస్‌ ఇండియా నేడు తమ ప్రత్యేకమైన బ్రాండ్‌ స్టోర్‌ను విశాఖపట్నంలో ప్రారంభించినట్లు వెల్లడించింది. ఈ స్టోర్‌లో కంపెనీ యొక్క మొత్తం ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్‌ హార్డ్‌వేర్‌ లభ్యమవుతుంది. వీటిలో అసుస్‌ ప్రతిష్టాత్మకమైన ఉత్పత్తులు అయిన వివోబుక్‌, జెన్‌బుక్‌, జెన్‌బుక్‌ ఫ్లిప్‌, డెస్క్‌టాప్‌లు, రిపబ్లిక్‌ ఆఫ్‌ గేమర్స్‌ (ఆర్‌ఓజీ) ల్యాప్‌టాప్‌లు కూడా ఉన్నాయి. నగర నడిబొడ్డున ఉన్న ఈ నూతన ఎక్స్‌క్లూజివ్‌ ప్రీమియం స్టోర్‌ 300 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది.
 
ఈ విస్తరణ గురించి అర్నాల్డ్‌ సూ, బిజినెస్‌ హెడ్‌, కన్స్యూమర్‌ అండ్‌ గేమింగ్‌ పీసీ, సిస్టమ్‌ బిజినెస్‌ గ్రూప్‌, అసుస్‌ ఇండియా మాట్లాడుతూ, ‘‘భారతదేశంలో మా వాణిజ్య కార్యకలాపాలు  విస్తరిస్తున్నామని వెల్లడిస్తుండటం పట్ల చాలా సంతోషంగా ఉన్నాము. మాకు అతి ముఖ్యమైన మార్కెట్‌లలో ఆంధ్రప్రదేశ్‌ ఒకటి. ఈ నూతన బ్రాండ్‌ స్టోర్‌ను విశాఖపట్నంలో ప్రారంభించడమన్నది దేశ వ్యాప్తంగా విభిన్న ప్రాంతాలలో మా తాజా ఆవిష్కరణలతో వినూత్న అనుభవాలను అందించడం ద్వారా వినియోగదారులకు తగిన శక్తిని అందించాలనే మా ప్రయత్నాలలో కీలకమైన ముందడుగుగా నిలుస్తుంది. వ్యూహాత్మక వాణిజ్య విస్తరణ విధానంతో, మా వినియోగదారులకు మరింత ఇంటరాక్షన్‌ సృష్టించడంతో పాటుగా టచ్‌పాయింట్లను సైతం అందించడం కొనసాగించనున్నాము’’ అని అన్నారు.
 
ఈ నూతన ఔట్‌లెట్‌ ఇప్పుడు బ్రాండ్‌ యొక్క మొత్తం రిటైల్‌ స్టోర్స్‌ సంఖ్యను ఆంధ్రప్రదేశ్‌లో మూడుకు తీసుకువెళ్లనుంది మరియు విశాఖపట్నంలో ఇది తొలిస్టోర్‌గా నిలుస్తుంది. ఈ స్టోర్లు వినూత్నమైన డెమో జోన్లు కలిగి ఉన్నాయి. ఇవి ప్రీమియం అనుభవాలను మరియు సేవలను వినియోగదారులకు అందించనున్నాయి. ఇవి వినియోగదారులకు బ్రాండ్‌ యొక్క తాజా గేమింగ్‌, లైఫ్‌ స్టైల్‌ ఉత్పత్తులు అయినటువంటి పీసీలు, డెస్క్‌టాప్‌లు, స్మార్ట్‌ఫోన్లు, విస్తృతశ్రేణి యాక్ససరీలు వ్యాప్తంగా అత్యాధునిక ఫీచర్లను తొలి సారిగా వీక్షించే అవకాశం అందిస్తూనే అనుసంధానిత అనుభవాలనూ సృష్టిస్తాయి.

సంబంధిత వార్తలు

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments