పాత రూ.1000 కరెన్సీ నోటు మార్పిడికి మరో ఛాన్స్?

ఠాగూర్
బుధవారం, 29 అక్టోబరు 2025 (21:54 IST)
దేశంలో నోట్ల రద్దుకు ముందు ఉన్న పాత రూ.1000 నోట్లను మార్పిడికి భారత రిజర్వు బ్యాంకు అనుమతి ఇచ్చిందంటూ సోషల్ మీడియా వేదికగా విస్తృతంగా ప్రచారం సాగుతోంది. దీన్ని కేంద్ర ఆర్థిక శాఖ ఖండించింది. కొన్నేళ్ల క్రితం రద్దయిన రూ.500, రూ.1000 కరెన్సీ నోట్లను మార్చుకోవడానికి రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా అనుమతి ఇవ్వడం లేదా కొత్త నిబంధనలు తీసుకొచ్చిందంటూ జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని స్పష్టం చేసింది. 
 
ఇదే అంశంపై సామాజిక మాధ్యమాల్లో సర్క్యులేట్ అవుతున్న వార్తలు తప్పని స్పష్టం చేసింది. దీనికి సంబంధించి ఆర్‌బీఐ ఎలాంటి నిబంధనలూ జారీ చేయలేదని పీఐబీ ఫ్యాక్ట్‌చెక్‌ విభాగం ‘ఎక్స్‌’లో పేర్కొంది. ఆర్‌బీఐ అధికారిక వెబ్‌సైట్‌ https://rbi.org.in/లో ఆర్థిక నిబంధనల సమాచారం, లేటెస్ట్‌ అప్‌డేట్స్‌ను చూసుకోవచ్చని సూచించింది.  
 
ఏవైనా అనుమానాస్పద మెసేజ్‌లు, ఫొటోలు, వీడియోలు ప్రజల దృష్టికి వస్తే పీఐబీ ఫ్యాక్ట్‌చెక్‌ విభాగానికి పంపాలని విజ్ఞప్తి చేసింది. వాట్సప్‌ నంబర్‌ +91 8799711259, లేదా factcheck@pib.gov.in ద్వారా ఈ-మెయిల్‌ చేయొచ్చని సూచించింది. 2016 నవంబర్‌లో కేంద్ర ప్రభుత్వం అకస్మాత్తుగా రూ.500, 1000 నోట్లను రద్దు చేసింది. దీంతో ఏర్పడిన కరెన్సీ కొరతను తీర్చేందుకు రూ.2000 నోట్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆ తర్వాత వాటినీ వినియోగం నుంచి ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సైబర్ క్రైమ్ పోలీసులను మళ్లీ ఆశ్రయించిన చిరంజీవి

Rajamouli : బాహుబలి ఎపిక్ తో రాజమౌళి అందరికీ మరో బాట వేస్తున్నారా !

Peddi: రామ్ చరణ్, జాన్వీ పై కేరళ లోని రైల్వే టనల్ దగ్గర పెద్ది షూటింగ్

సినిమాలకు గుడ్‌బై చెప్పనున్న సూపర్ స్టార్ రజనీకాంత్?

China Peace : స్పై డ్రామా చైనా పీస్ నుంచి ఇదేంటో జేమ్స్ బాండ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments