Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏప్రిల్‌లో బ్యాంకులకు 12 రోజులు సెలవులు

Webdunia
మంగళవారం, 23 మార్చి 2021 (12:09 IST)
ఏప్రిల్‌లో బ్యాంకులకు 12 రోజులు సెలవులున్నాయి. అంటే ఏప్రిల్‌లో బ్యాంకులు పనిచేసేది 18 రోజులే. ఇవే కాదు... మార్చి 27 నుంచి ఏప్రిల్ 4 వరకు మొత్తం 10 రోజుల్లో బ్యాంకులకు 7 రోజులు సెలవులు ఉంటాయి. ఆ 10 రోజుల్లో బ్యాంకులు తెరిచి ఉండేది 3 రోజులే. ప్రభుత్వరంగ బ్యాంకులు మాత్రమే కాదు ప్రైవేట్ బ్యాంకులకు కూడా ఇవే సెలవులు వర్తిస్తాయి. 
 
హోలీ పండుగ, గుడ్ ఫ్రైడే, నాలుగో శనివారం, రెండు ఆదివారాలు రావడంతో ఈ సెలవులు రానున్నాయి. కాబట్టి మీ లావాదేవీలను ప్లాన్ చేసుకునే ముందు ఏఏ రోజులు సెలవులు ఉంటాయో తెలుసుకోవడం అవసరం. ఏప్రిల్‌లో పండుగలు, ఇతర సెలవులు ఎక్కువగా వచ్చాయి. దీంతో బ్యాంకులు మూసేసి ఉంటాయి. గుడ్ ఫ్రైడే, ఉగాది, శ్రీరామనవమితో పాటు బాబూ జగ్జీవన్ రామ్ జయంతి, అంబేద్కర్ జయంతి ఉన్నాయి. వీటితో పాటు ఆదివారాలు, రెండో శనివారం, నాలుగో శనివారం బ్యాంకులకు సెలవే. ఇవన్నీ కలిపి మొత్తం 12 రోజులు బ్యాంకులు మూసేసి ఉంటాయి.
 
బ్యాంకుల సెలవుల వివరాలు: ఏప్రిల్ 1- బ్యాంకుల అకౌంటింగ్, ఏప్రిల్ 2- గుడ్ ఫ్రైడే, ఏప్రిల్ 4- ఆదివారం, ఏప్రిల్ 5- బాబూ జగ్జీవన్ రామ్ జయంతి, ఏప్రిల్ 10- రెండో శనివారం, ఏప్రిల్ 11- ఆదివారం, ఏప్రిల్ 13- ఉగాది, ఏప్రిల్ 14- అంబేద్కర్ జయంతి, ఏప్రిల్ 18- ఆదివారం, ఏప్రిల్ 21- శ్రీరామనవమి, ఏప్రిల్ 24- నాలుగో శనివారం, ఏప్రిల్ 25- ఆదివారం.
 
ఇవన్నీ హైదరాబాద్ సర్కిల్‌లో అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని సెలవులు. ఈ సెలవులు రాష్ట్రాలను బట్టి వేర్వేరుగా ఉంటాయి. కస్టమర్లు ఈ సెలవుల్ని దృష్టిలో పెట్టుకొని తమ లావాదేవీలను ప్లాన్ చేసుకోవాలి.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments