Webdunia - Bharat's app for daily news and videos

Install App

500 రూపాయల నోట్లపై గాంధీజీకి బదులుగా అనుపమ్ ఖేర్!

సెల్వి
సోమవారం, 30 సెప్టెంబరు 2024 (10:55 IST)
Anupam Kher
భారతదేశంలో నకిలీ కరెన్సీ నోట్లు కొత్త విషయం కాదు. అయితే దిగ్గజ నటుడు అనుపమ్ ఖేర్ చిత్రం ఉన్న 500 రూపాయల నోట్లను మీరు ఎప్పుడైనా చూశారా? అవును, మహాత్మా గాంధీకి బదులుగా అనుపమ్ ఖేర్ చిత్రం ఉన్న రూ. 1.60 కోట్ల విలువైన నకిలీ కరెన్సీ నోట్లను అహ్మదాబాద్ పోలీసులు గుజరాత్‌లో స్వాధీనం చేసుకున్నారు, 
 
అలాగే, నోట్లపై 'రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా'కు బదులుగా 'రిసోల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా' అని ముద్రించారు. నకిలీ నోట్ల చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి, ఈ సంఘటనపై పలువురు దిగ్భ్రాంతిని వ్యక్తం చేయగా, మరికొందరు ఇది వినోదభరితంగా సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు. 
 
అంతకుముందు, గుజరాత్‌లోని సూరత్ నగరంలో ఆన్‌లైన్ వస్త్ర దుకాణం కార్యాలయంలో నిర్వహిస్తున్న నకిలీ కరెన్సీ తయారీ యూనిట్‌ను ఛేదించారు. ఈ ఘటనకు సంబంధించి నలుగురిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.
 
దీనిపై డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్ రాజ్‌దీప్ నకుమ్ మాట్లాడుతూ, నిందితులు నటుడు షాహిద్ కపూర్ నటించిన వెబ్ సిరీస్ ఫర్జీ నుండి ప్రేరణ పొందారని ఆరోపించారు. ఇది నకిలీ కరెన్సీ నోట్ల ద్వారా ధనవంతుడైన ఆర్టిస్ట్‌ కథను ఎత్తి చూపిస్తుందన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

కింగ్‌డమ్ విషయంలో పెద్ద ఛాలెంజ్ పరీక్షలో పాస్ అయ్యాము: సూర్యదేవర నాగ వంశీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments