Webdunia - Bharat's app for daily news and videos

Install App

విస్తరణ కొనసాగిస్తోన్న ఏంజెల్‌-రాకెట్‌; రెండవ ఔట్‌లెట్‌ ప్రారంభం

Webdunia
గురువారం, 4 మే 2023 (22:47 IST)
శరత్‌ సిటీ క్యాపిటల్‌ మాల్‌లో తమ తొలి స్టోర్‌ సాధించిన విజయం అందించిన స్ఫూర్తితో  కిడ్స్‌ క్లాతింగ్‌ స్టోర్‌, ఏంజెల్‌ & రాకెట్‌ తమ తలుపులను బంజారాహిల్స్‌  రోడ్‌ నెంబర్‌ 12లో తెరిచింది. ఈ నూతన స్టోర్‌ 1588 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉండటంతో పాటుగా బ్రాండ్‌ యొక్క స్ర్పింగ్‌ సమ్మర్‌ కలెక్షన్‌ ప్రదర్శించనుంది. వేసవి ఆనందానికి మరింత సంతోషాన్ని జోడిస్తూ స్టేట్‌మెంట్‌ స్లీవ్స్‌తో బ్రాడిరీ మరియు ప్రైరీ గాళ్‌ ప్రింట్స్‌తో కూడిన కూల్‌ కో-ఆర్డ్‌ సెట్స్‌తో టెక్చర్డ్‌ కాటన్‌ వస్త్రాలు ఈ వసంత కాలాన్ని మరింత ఆహ్లాదంగా మారుస్తాయి.
 
ఈ వేసవి కలెక్షన్‌ పూర్తి స్థాయిలో ప్రకాశం, ఆనందం, శైలి అందిస్తుందనే వాగ్ధానం చేస్తుంది. బాలికల కోసం  ఈ బ్రాండ్‌ , డిజిటల్‌ లావెండర్‌తో చిలకరించినట్లుగా తేలికపాటి, సౌకర్యవంతమైన కాటన్‌ సీర్‌సక్కర్స్‌ ఫ్యాబ్రిక్స్‌తో ఆహ్లాదంగా, ఆందంగా ఉంచుతుంది. సూక్ష్మ అంశాలకు కూడా అమిత ప్రాధాన్యత అందించడంతో పాటుగా డిజైన్‌, నాణ్యత పట్ల అమిత శ్రద్ధ చూపే ఏంజెల్‌ & రాకెట్‌, తమ వినియోగదారులకు రాజీలేనటువంటి రీతిలోవస్త్రాలు అందిస్తుంది. ‘బై బెటర్‌, వియర్‌ లాంగర్‌. హ్యాండ్‌ డౌన్‌’ అనే సిద్ధాంతంతో నడుపబడుతుండటంతో పాటుగా ట్రెండ్స్‌కు అనుగుణంగా తమ వస్త్రశ్రేణి రూపొందిస్తుంటుంది. ఈ వస్త్రాలన్నీ కూడా పర్యావరణ అనుకూలంగానే ఉంటాయి. ఈ వస్త్రాలను యుకెలో డిజైన్‌ చేయడంతో పాటుగా ప్రపంచవ్యాప్తంగా నీతివంతమైన ఫ్యాక్టరీలలో  తయారుచేస్తున్నారు.  ఏంజెల్‌ & రాకెట్‌  న్యాయమైన వాణిజ్యం చేయడంతో పాటుగా రీసైకిల్డ్‌ పాలిస్టర్‌ ఫ్యాబ్రిక్స్‌, ఆర్గానిక్‌ కాటన్స్‌ వినియోగిస్తుంది.
 
ఈ నూతన స్టోర్‌ ప్రారంభం సందర్భంగా కో-ఫౌండర్‌ ఎస్‌ చెందురన్‌ మాట్లాడుతూ, ‘‘నా భాగస్వామి లూయిస్‌ బోస్టోక్‌ మరియు తాను తమ రెండవ స్టోర్‌ను  హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో ప్రారంభించడం పట్ల చాలా సంతోంగా ఉన్నాము. శరత్‌ సిటీ క్యాపిటల్‌ మాల్‌లో ఏర్పాటుచేసిన తమ మొదటి స్టోర్‌కు చక్కటి స్పందన అందుకున్నాము. కిడ్స్‌వేర్‌కు ఈ తరహా ఆదరణ లభించడం ఆనందంగా ఉంది. డిమాండ్‌  ధోరణి కనిపిస్తుండటం, ఫ్యాషన్‌లు కూడా పెరుగుతుండటం చేత ఏంజెల్‌ & రాకెట్‌  లాంటి బ్రాండ్లకు ప్రీమియం నాణ్యత కలిగిన కిడ్స్‌వేర్‌ క్లాతింగ్‌ అందించే అవకాశం కలుగుతుంది’’ అని అన్నారు.
 
శరత్‌ సిటీ క్యాపిటల్‌ మాల్‌లో ఏర్పాటుచేసిన మొదటి స్టోర్‌ చక్కటి ఆదరణ  పొందుతుంది. రిపీట్‌ కస్టమర్ల రాక పెరుగుతుండటం చేత గణనీయంగా అమ్మకాలు పెరుగుతున్నాయి.  తమ విస్తరణ ప్రణాళికల పట్ల ఈ బ్రాండ్‌ పూర్తి ఆసక్తిగా ఉంది.  హైదరాబాద్‌లో మరో స్టోర్‌ తెరిచేందుకు  తగిన అవకాశాలున్నాయని సంస్థ నమ్ముతుంది. త్వరలోనే  చెన్నై, ఢిల్లీలో కూడా స్టోర్లను ప్రారంభించనుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'గేమ్ ఛేంజర్' నుంచి మరో లిరికల్ సాంగ్.. ఎలావుందంటే?(Video)

నాకోసం పోలీసులు వెతుకుతున్నారా? 26 పాయింట్లతో రాంగోపాల్ వర్మ భారీ ట్వీట్

మాలీవుడ్ ప్రేక్షకులకు ఇచ్చే అతిపెద్ద బహుమతి ఇదే : అల్లు అర్జున్

కోర్టు డ్రామా నేపథ్యంగా సాగే ఉద్వేగం మూవీ రివ్యూ

సమంత "రాణి"గా అభివర్ణించిన శ్రీలీల.. ఎందుకో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

తర్వాతి కథనం
Show comments