Webdunia - Bharat's app for daily news and videos

Install App

రివార్డ్స్ గోల్డ్‌ను ప్రారంభించిన అమేజాన్ పే: రోజూవారీ ఖర్చుల కోసం క్యాష్ బాక్ ప్రోగ్రాం

ఐవీఆర్
సోమవారం, 14 జులై 2025 (23:13 IST)
అర్హత కలిగిన ప్రతి లావాదేవీపై ప్రైమ్ సభ్యులకు 5% క్యాష్ బాక్, నాన్-ప్రైమ్ కస్టమర్లకు 3% క్యాష్ బాక్‌ను అందించే సరళమైన రివార్డ్స్ కార్యక్రమం, ‘రివార్డ్స్ గోల్డ్‘ను అమేజాన్ పే పరిచయం చేస్తోంది. దీనికి అర్హులుగా మారడం సులభం: ఈ రివార్డ్స్‌ను పొందడానికి అమేజాన్ పే ద్వారా షాపింగ్ లేదా చెల్లింపుల్లో ఏవైనా 25 లావాదేవీలను పూర్తి చేయాలి. ఒకసారి అర్హత పొందిన తరువాత, విస్తృత శ్రేణి విభాగాలు మరియు వ్యాపారుల్లో ప్రతి తదుపరి లావాదేవీపై 5% వరకు సభ్యులు ఖచ్చితంగా క్యాష్ బాక్ పొందుతారు.
 
అమేజాన్ ఇండియా వారి ఫ్లాగ్ షిప్ ప్రైమ్ డే షాపింగ్ కార్యక్రమం గురించి ఉత్సాహం ఏర్పడటంతో, కస్టమర్లు రివార్డ్స్ గోల్డ్ కోసం వేగంగా అర్హులుగా మారడం ద్వారా తమ ఆదాలను గరిష్టం చేయవచ్చు.25 లావాదేవీల యొక్క ఏదైనా కలయిక- అది UPI చెల్లింపులు కావచ్చు, డబ్బు పంపించడం, QR కోడ్స్ స్కానింగ్ చేయడం కావచ్చు, రీఛార్జీలు చేయడం కావచ్చు, లేదా షాపింగ్ చేయడం కావచ్చు- ఈ ప్రీమియం ప్రయోజనాలను ఇస్తుంది.
 
కిరాణా, దుస్తులు, ప్రయాణం, వినోదం, ఆహారం డెలివరీ మరియు ఇంకా ఎన్నో ప్రసిద్ధి చెందిన ఖర్చులు చేసే శ్రేణుల్లో ప్రైమ్ సభ్యుల కోసం ఈ ప్రోగ్రాం 5% అపరిమితమైన క్యాష్ బాక్ హామీని ఇస్తోంది. డిజిటల్ చెల్లింపుల రివార్డ్స్ భారతదేశంలో ఏ విధంగా అనుభవించబడుతున్నాయో ఇది ఒక ముఖ్యమైన పరిణామం. ఈ క్యాష్ బాక్ ను 5,000+ ఆఫ్ లైన్ బ్రాండ్ స్టోర్స్ సహా అమెజాన్ డాట్ ఇన్ పై, 55,000+ భాగస్వామ వ్యాపారులలో నిరంతరంగా రెడీమ్ చేయవచ్చు.
 
“రివార్డ్స్ సరళంగా, నిజాయితీగా ఉండాలని, కస్టమర్లు భారీగా ఆదా చేయడంలో సహాయపడటం అమేజాన్ పేలో, మేము విశ్వసిస్తాం” అని గిరీష్ కృష్ణన్, డైరెక్టర్, అమేజాన్ పేమెంట్స్-రివార్డ్స్ అన్నారు. “రివార్డ్స్ గోల్డ్ ప్రోగ్రాంతో, కస్టమర్లు తమ UPI చెల్లింపుల కోసం అమేజాన్ పేని ఉపయోగిస్తున్నారు మరియు షాపింగ్ చేసిన ప్రతిసారి బహుమతులు అందచేయబడతాయి. ఈ ప్రోగ్రాం మా కస్టమర్లతో దీర్ఘకాల సంబంధాలను రూపొందించడానికి మా నిబద్ధతను సూచిస్తోంది.”
 
రివార్డ్స్ గోల్డ్ లో భాగంగా, కస్టమర్లు కొన్ని ఉత్సాహభరితమైన ప్రతిపాదనలు ఆనందించవచ్చు:
ఎక్కువ షాపింగ్ చేయండి, ఎక్కువ సంపాదించండి: కిరాణా, దుస్తులు, ఫుట్ వేర్, లగేజీ, బ్యూటీ మరియు ఇంకా ఎన్నో వాటిపై అపరిమితంగా 5% క్యాష్ బాక్ పొందవచ్చు
తెలివిగా ప్రయాణించండి: హోటల్ బుక్కింగ్స్ పై 5% అన్ లిమిటెడ్ క్యాష్ బాక్
వినోదంతో బహుమతులు పొందండి: మైక్రోసాఫ్ట్ Xbox, జియో హాట్ స్టార్ సబ్ స్క్రిప్షన్స్, పుస్తకాలు మరియు బొమ్మలు వంటి వినోదపు ప్లాట్ ఫాంస్ పై 5% క్యాష్ బాక్.
ఎవ్విరీడే యాప్స్, ఎవ్విరిడీ క్యాష్ బాక్: ఓలా, డోమినోస్, మరియు జొమాటో డిస్ట్రిక్ట్ వంటి యాప్స్ పై 5% అన్ లిమిటెడ్ క్యాష్ బాక్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అభిమానులకు సర్‌ప్రైజ్‌లు ఇవ్వనున్న 'హరిహర వీరమల్లు'

Naga Chaitanya : ప్రియదర్శి, ఆనంది ల ప్రేమంటే లవ్లీ ఫస్ట్ లుక్

Kiran Abbavaram: K-ర్యాంప్ నుంచి గ్లింప్స్ రిలీజ్, రిలీజ్ డేట్ ప్రకటన

రొటీన్ కు భిన్నంగా పోలీస్ వారి హెచ్చరిక వుంటుంది : దర్శకుడు బాబ్జీ

Mr. Reddy : నా జీవితంలో జరిగిన కథే మిస్టర్ రెడ్డి : టీఎన్ఆర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

తర్వాతి కథనం
Show comments