Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.వెయ్యి ధర లోపు ఉండే ఎయిర్‌టెల్ సరికొత్త ప్లాన్లు ఏవి?

ఠాగూర్
సోమవారం, 3 జూన్ 2024 (15:49 IST)
భారతీ ఎయిర్‌టెల్‌ బ్రాడ్‌బ్యాండ్‌ సర్వీస్‌ ఎక్స్‌ట్రీమ్‌ ఫైబర్‌ కొత్త వినియోగదారులను ఆకర్షించేందుకు సరికొత్త ప్లాన్‌ను ప్రకటించింది. ఎక్స్‌ట్రీమ్‌ ఫైబర్‌ ప్లాన్‌ పేరుతో రూ.1,000లోపు ధర కలిగిన ప్లాన్లను ప్రకటించింది. ఇందులో బ్రాడ్‌బ్యాండ్‌ ప్లాన్‌ రూ.499 ఒకటి. ఇందులో 40 ఎంబీపీఎస్ వేగంతో నెలకు 3.3 టీబీ డేటా లభిస్తుంది. వింక్‌ మ్యూజిక్‌, అపోలో 24/7 అదనపు ప్రయోజనాలు. రూ.వెయ్యి లోపువున్న మరో ప్లాన్‌ రూ.699. దీంట్లోనూ 40 ఎంహీరీఎస్ వేగంతో ఇంటర్నెట్‌ను ఎంజాయ్‌ చేయొచ్చు. హెచ్‌డీతో కలిపి 350కి పైగా టీవీ ఛానళ్లను వీక్షించొచ్చు. డిస్నీ+ హాట్‌స్టార్ సహా 20కి పైగా ఓటీటీలను ఎంజాయ్‌ చేయొచ్చు.
 
ఎయిర్‌టెల్‌ ఎక్స్‌ట్రీమ్‌ ఫైబర్‌లో రూ.799తోనూ ఓ ప్లాన్ అందుబాటులో ఉంది. దీంట్లో ఇంటర్నెట్‌ వేగం 100 ఎంబీపీఎస్. నెలకు 3.3 టీబీ డేటా లభిస్తుంది. వింక్ మ్యూజిక్‌, ఎక్స్‌ట్రీమ్‌ ప్లే సబ్‌స్క్రిప్షన్‌ అదనపు ప్రయోజనాలు. వీటితో పాటు మరిన్ని ప్రయోజనాలు కావాలంటే రూ.899 ప్లాన్‌ను పరిశీలించొచ్చు. దీంట్లో డిస్నీ+ హాట్‌స్టార్‌, అమెజాన్‌ ప్రైమ్‌ సహా 20కి పైగా ఓటీటీలు ఉంటాయి. డీటీహెచ్‌లో భాగంగా హెచ్‌డీతో కలిపి 350కి పైగా ఛానళ్లను వీక్షించొచ్చు.
 
వీటిన్నింటినీ ఆరు లేదా 12 నెలల వ్యాలిడిటీతో ఒకేసారి తీసుకుంటే వైఫై రూటర్‌, ఇన్‌స్టలేషన్‌ ఉచితంగా అందిస్తారు. అలాగే అన్ని ప్లాన్లలో ఫిక్స్‌డ్‌లైన్ వాయిస్‌ కాలింగ్‌ కనెక్షన్‌ ఉచితం. అయితే, ల్యాండ్‌లైన్‌కు సంబంధించిన పరికరాలను మాత్రం సొంతంగా కొనుగోలు చేయాల్సి ఉంటుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan Kalyan: పవన్ కల్యాణ్ మార్షల్ ఆర్ట్స్ ట్రైనర్ నటుడు షిహాన్ హుస్సేని మృతి

Varun Tej: వరుణ్ తేజ్ హీరోగా ఇండో-కొరియన్ హారర్-కామెడీ చిత్రం

'కన్నప్ప'ను ట్రోల్ చేస్తే శివుని ఆగ్రహానికి శాపానికి గురవుతారు : రఘుబాబు

నందమూరి బాలకృష్ణ ఆదిత్య 369 రీ రిలీజ్ విడుదల తేదీ మార్పు

Suhas: స్పిరిట్ లో పాత్ర ఫైనల్ కాలేదు, విలన్ పాత్రలంటే ఇష్టం : సుహాస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

మహిళల్లో కేన్సర్ ముప్పుకు కారణం అదేనా?

Summer Drinks: పిల్లలకు వేసవిలో ఎలాంటి ఆరోగ్యకరమైన జ్యూస్‌లు ఇవ్వాలి?

White Pumpkin Juice: పరగడుపున తెల్ల గుమ్మడికాయ రసం-ఒక నెలలో ఐదు కిలోల బరువు డౌన్

తర్వాతి కథనం
Show comments