Webdunia - Bharat's app for daily news and videos

Install App

డెలివరీ సర్వీస్ పార్టనర్ ప్రోగ్రామ్ ద్వారా 12 మంది కొత్త వ్యాపారవేత్తలను ఆన్‌బోర్డ్ చేసుకున్న అమెజాన్ ఇండియా

Webdunia
మంగళవారం, 10 అక్టోబరు 2023 (21:59 IST)
తెలంగాణ, కర్ణాటక, ఢిల్లీ ఎన్‌సీఆర్ (నేషనల్ క్యాపిటల్ రీజియన్), మహారాష్ట్ర వ్యాప్తంగా తన డెలివరీ సర్వీస్ పార్టనర్ (DSP) కార్యక్రమంలో భాగంగా 12 కొత్త ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ఆన్‌బోర్డ్ చేసుకున్నామని అమెజాన్ ఇండియా నేడు ప్రకటించింది. పండుగ సీజన్‌ సమయంలో అమెజాన్ ఇండియా లాస్ట్ మైల్ నెట్‌వర్క్‌ను ఈ కార్యక్రమం బలోపేతం చేస్తుంది. లాజిస్టిక్స్ అనుభవం తక్కువగా ఉన్నప్పటికీ, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు తమ సొంత డెలివరీ వ్యాపారాలను అభివృద్ధి చేసుకుని, నిర్వహించుకునేందుకు మరియు వేలాది మంది డెలివరీ అసోసియేట్‌లకు పని అవకాశాలను డీఎస్‌పీ ప్రోగ్రామ్ అందిస్తుంది. అమెజాన్ తన 20 ఏళ్ల కన్నా ఎక్కువ కార్యాచరణ అనుభవం, అత్యుత్తమ-శ్రేణి సాంకేతికత, అమెజాన్ ప్యాకేజీలను సురక్షితంగా మరియు విజయవంతంగా రవాణా చేసేందుకు సహకారాన్ని అందించేందుకు ఈ కొత్త వ్యాపార యజమానులకు అవసరమైన ప్రత్యేక సేవలు మరియు ప్రాపర్టీ సూట్ మద్దతు ఇస్తుంది.
 
డీఎస్‌పి ప్రోగ్రామ్‌తో, అమెజాన్ వినియోగదారులకు ప్యాకేజీలు, వారికి వృద్ధి మార్గాలను అందించుందకు అమెజాన్ ఇండియా దాదాపు 300 చిన్న మరియు మధ్య తరహా వ్యాపారాలతో (SMBs) భాగస్వామ్యం కలిగి ఉంది. గత రెండేళ్లలో అమెజాన్ ఇండియా ఇప్పటికే దాదాపు 100 కొత్త డీఎస్‌పీలను ఆన్‌బోర్డ్ చేసుకోగా, భవిష్యత్తులో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు మరిన్ని అవకాశాలను అందించనుంది. మొత్తంమీద, అమెజాన్ ఇండియా నెట్‌వర్క్ 750 కన్నా ఎక్కువ నగరాల్లో అమెజాన్ ఇండియా లేదా వారి భాగస్వాములకు చెందిన దాదాపు 2000 డెలివరీ స్టేషన్‌లను కలిగి ఉంది.
 
‘‘వందలాది చిన్న వ్యాపార యజమానులు డెలివరీ సర్వీస్ పార్టనర్ (DSP) ప్రోగ్రాం ద్వారా అభివృద్ధి చెందే దిశలో ప్రయోజనలను అందుకోవడం నాకు చాలా గర్వకారణం. ప్రోగ్రామ్ కొనసాగుతున్న సమయంలో మా డెలివరీ సర్వీస్ పార్ట్‌నర్‌లు, వారి సహచరులకు ఏళ్ల తరబడి అనుభవాన్ని మెరుగుపరిచేందుకు మేము సరికొత్త ఆవిష్కరణల సహకారాన్ని అందిస్తున్నాము. సరైన మార్గదర్శకత్వంతో, ఈ వ్యాపారవేత్తలకు విజయవంతమైన లాజిస్టిక్స్ వ్యాపారాన్ని, వారి ఎంటర్‌ప్యూనిరల్ ప్రయాణానికి బలమైన పునాదిని నిర్మించడమే కాకుండా, వారు భారీ స్థాయిలో ప్రజలకు అవకాశాలను పర్యావరణ వ్యవస్థను కూడా సృష్టిస్తారు’’ అని భారతదేశంలోని అమెజాన్ లాజిస్టిక్స్ డైరెక్టర్ డాక్టర్ కరుణ శంకర్ పాండే పేర్కొన్నారు.
 
భారత దేశంలోని చిరు వ్యాపారాలను నిర్వహించే వారు తమ సముదాయాలను అర్థం చేసుకుంటూ, గొప్ప డెలివరీ నెట్‌వర్క్ బృందాన్ని రూపొందించేందుకు వారికి సహాయపడతారు. ఈ వ్యాపార నిర్వహణలో ఉన్న వారు సమర్థవంతమైన డెలివరీ అసోసియేట్‌లను నియమించుకుని, వారి అభివృద్ధికి సహకరిస్తారు. అయితే డీఎస్పీ ప్రోగ్రామ్ వారికి స్థిరమైన ప్యాకేజీ వాల్యూమ్, లాజిస్టిక్స్ అనుభవం, అమెజాన్ సాంకేతికత మరియు వారి వ్యాపారాలు వృద్ధి చెందేందుకు అనుకూలీకరించిన వనరులతో మద్దతు ఇస్తుంది. అమెజాన్ తన డీఎస్‌పీ ప్రోగ్రామ్‌ను ప్రారంభించినప్పటి నుంచి, డీఎస్‌పీల కోసం కొత్త ప్రత్యేక సాధనాలతో ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీలో బిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడి పెట్టింది. ఈ పెట్టుబడితో, ~3800 చిన్న లాజిస్టిక్స్ కంపెనీలు అభివృద్ధి చెందుతూ, ప్రపంచవ్యాప్తంగా డెలివరీ అసోసియేట్‌ల కోసం పదివేల కన్నా ఎక్కువ ఉద్యోగాలను సృష్టించాయి.
 
సమాజానికి ప్రత్యేకమైనదాన్ని అందించాలని, అనేక మందికి అర్ధవంతమైన పని అవకాశాలను సృష్టించాలనే కోరికతో, వ్యక్తులు తమ వ్యాపార నిర్వహణ కలలను కొనసాగించేందుకు మరింత సంప్రదాయ వృత్తిని వదిలిపెట్టి, సాహసోపేతమైన అడుగు వేశారు. భార్యాభర్తలైన ప్రదీప్ కుమార్, పూనమ్ ఠాకూర్ ఇద్దరూ హైదరాబాద్‌లో ఎఫ్2ఆర్‌బి (F2RB) లాజిస్టిక్స్ కంపెనీ సహ వ్యవస్థాపకులు సరిగ్గా ఆ పని చేశారు.
 
‘‘అమెజాన్ డెలివరీ సర్వీస్ పార్ట్‌నర్‌గా మా ప్రయాణం నిజంగా ప్రతిఫలదాయకంగా ఉండడంతో నేను ప్రతి క్షణాన్ని నిజంగా ప్రేమిస్తున్నాను. గత మూడేళ్లలో మేము గణనీయమైన వృద్ధిని సాధించి, హైదరాబాద్‌లో విలువైన ఉద్యోగ అవకాశాలను సృష్టించాము’’ అని ప్రదీప్ తెలిపారు. ‘‘నేను స్వాతంత్ర్యానికి ఎల్లప్పుడూ విలువ ఇస్తాను. మా వ్యాపారం మాకు హైదరాబాద్‌లో స్థానిక ఉద్యోగ అవకాశాలను అందించేందుకు అనుమతించింది. అమెజాన్ అందించిన శిక్షణ, అత్యాధునిక సాంకేతికత మాకు ప్రారంభ అడ్డంకులను అధిగమించేందుకు, వేగవంతమైన వృద్ధిని సాధించడంలో మాకు సహాయం చేయడంలో కీలక పాత్ర పోషించింది’’ అని పూనమ్ వివరించారు.
 
డెలివరీ సర్వీస్ పార్టనర్ (DSP) కార్యక్రమం గత కొన్నేళ్లలో చక్కని ప్రగతిసాధించింది. ఇది మొదటిసారిగా వ్యాపారవేత్తలుగా మారిన వారికి వృద్ధి మార్గాలను సృష్టిస్తుంది. అమెజాన్ ఇండియా తన కార్యకలాపాల నెట్‌వర్క్‌ను దేశంలోని లోతట్టు ప్రాంతాలలో ఖర్చు చేయడాన్ని కొనసాగిస్తున్నందున, తన లాస్ట్ మైలు కార్యక్రమం ద్వారా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అవకాశాలను సృష్టించడాన్ని కొనసాగిస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nidhi Agarwal: ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్‌లో చిక్కిన పవన్ హీరోయిన్ నిధి అగర్వాల్ (video)

Jwala Gutta: గుండె జారి గల్లంతయ్యిందేలో ఐటమ్ సాంగ్‌తో ఇబ్బంది పడ్డాను.. జ్వాలా గుత్తా

Keerthy Suresh సోషల్ మీడియాలో ట్రెండ్ అయిన కీర్తి సురేష్

Nag Ashwin: నాని, విజయ్ దేవరకొండ కాంబో సినిమా, కల్కి 2 గురించి నాగ్ అశ్విన్ ఏమన్నాడంటే

రొమాంటిక్ థ్రిల్లర్ గా కిల్లర్ ఆర్టిస్ట్ సినిమా: ప్రొడ్యూసర్ జేమ్స్ వాట్ కొమ్ము

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

Fennel Water: పరగడుపున సోంపు నీటిని తాగితే ఏంటి లాభం? ఎవరు తాగకూడదు..?

Banana: మహిళలు రోజూ ఓ అరటి పండు తీసుకుంటే.. అందం మీ సొంతం

అమెరికా తెలుగు సంబరాలు: తెలుగు రాష్ట్రాల సీఎంలకు నాట్స్ ఆహ్వానం

తర్వాతి కథనం
Show comments