Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉద్యోగులకు శుభవార్త చెప్పిన కేంద్రం .. ఏంటది?

Webdunia
సోమవారం, 18 జనవరి 2021 (13:37 IST)
ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇందులో 50 లక్షల మంది కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులతో పాటు 61 లక్షల మంది పింఛనుదారులు కూడా ఉన్నారు. 
 
ఏడో వేతన సంఘం సిఫార్సులతో పాటు.. ప్రస్తుతం ఉన్న 28 శాతం ద్రవ్యోల్బణానికి అనుగుణంగా కరవు భత్యం (డీఏ), డియర్‌నెస్ రిలీప్ (డీఆర్‌)లను పెంచేందుకు నిర్ణయించినట్టు సమాచారం. 
 
కేంద్ర ప్రభుత్వ వర్గాల సమాచారం మేరకు... డీఏను 17 నుంచి 21 శాతానికి అంటే 4 శాతం పెంచేందుకు నిర్ణయించింది. జనవరి నుంచి ఇది వర్తించే అవకాశం ఉంది. అయితే, దీనిపై కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ మాత్రం అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. 
 
కాగా, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య ఇటీవల ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిసి, ప్రభుత్వ ఖజానా ప్రస్తుత పరిస్థితిని వివరించి, ప్రస్తుత ద్రవ్యోల్బణం ప్రకారం ఉద్యోగులు, పెన్షనర్లకు డీఏ ఇవ్వాలని కోరారు. 
 
కోవిడ్ సంక్షోభం కారణంగా 2021 జూలై వరకూ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల డీఏలో ఇంక్రిమెంట్ నిలిపివేయాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ గత ఏప్రిల్ 2020న నిర్ణయించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బెనెగల్ చిత్రాలు భారత సంస్కృతి సంపద : చిరంజీవి

బెంగాలీ దర్శకుడు శ్యామ్ బెనెగల్ కన్నుమూత

Peelings: పీలింగ్స్ పాటలో అల్లు అర్జున్ ఎత్తుకుంటే భయమేసింది.. అసౌకర్యంగా?

అల్లు అర్జున్ ఇష్యూకు చిరంజీవి సీరియస్ - రేవంత్ రెడ్డి పీఠానికి ఎసరు కానుందా?

బాలకృష్ణ కెరీర్ లో గుర్తుండిపోయే చిత్రం డాకు మహారాజ్ : చిత్ర దర్శక నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?

ఏ పాత్రల్లోని వంట ఆరోగ్యానికి మంచిది? ఏవి మంచివి కావు?

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

హైదరాబాద్ లోని నాగోల్‌లో రిలయన్స్ రిటైల్ ‘యూస్టా’ సరికొత్త స్టోర్ ప్రారంభం

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

తర్వాతి కథనం
Show comments