Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్థిక ప్రణాళికలో బీమా అతి కీలకమని 78% మంది భారతీయులు భావిస్తున్నారు: ఎస్‌బీఐ లైఫ్‌ ఫైనాన్షియల్‌ ఇమ్యూనిటీ సర్వే 2.0

Webdunia
సోమవారం, 31 జనవరి 2022 (09:46 IST)
దేశంలో అత్యంత విశ్వసనీయమైన ప్రైవేట్‌ జీవిత భీమా సంస్థలలో ఒకటైన ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్సూరెన్స్‌, మరోమారు సమగ్రమైన వినియోగదారుల అధ్యయనం ‘ద ఫైనాన్షియల్‌ ఇమ్యూనిటీ సర్వే 2.0’ను విడుదల చేసింది. కోవిడ్‌ అనంతర ప్రపంచంలో ఆర్ధికంగా సంసిద్ధం కావాల్సిన  వేళ వినియోగదారుల మారుతున్న ప్రవర్తన పరంగా లోతైన అంశాలను ఈ అధ్యయనం వెల్లడిస్తుంది. ఎస్‌బీఐ లైఫ్‌ ఈ అధ్యయనంను నీల్సన్‌ ఐక్యు (ఇండియా) ప్రైవేట్‌ లిమిటెడ్‌తో కలిసి ఈ అధ్యయనంను భారతదేశ వ్యాప్తంగా 28 కీలక నగరాలలో 5 వేల మంది స్పందనదారులతో నిర్వహించింది.

 
ప్రస్తుత మహమ్మారి నేపథ్యంలో, అధికశాతం మంది భారతీయులు దేశం ఈ పరిస్థితులు లేదంటే సంభావ్య మూడో వేవ్‌ను అధిగమించగలదనే ఆశాభావంతో ఉన్నారు. ఈ పరిస్థితులను అధిగమించగలమనే విశ్వాసం ఆశ్చర్యకరమే అయినా 80% మందికి పైగా భారతీయులు ఒకటి లేదంటే రెండు డోసుల వ్యాక్సినేషన్‌ తీసుకోవడం ద్వారా శారీరకంగా రోగ నిరోధక శక్తిని పెంచుకున్నామని భావిస్తున్నారు. కానీ 38% మంది భారతీయులు రాబోయే మూడు నెలల్లో పరిస్థితులు దిగజారే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. వారి అతి ముఖ్యమైన ఆందోళనలలో 1. వృద్ధి చెందుతున్న వైద్య/చికిత్స ఖర్చులు 2. ఉద్యగాలలో అస్థిరత 3. స్వీయ/కుటుంబ ఆరోగ్యం పట్ల ఆందోళన ఉన్నాయి.

 
ఈ అధ్యయన ఫలితాలు మరింతగా మహమ్మారి వేళ తమ ఆదాయంపై పడుతున్న ప్రభావం గురించి వినియోగదారులు ఎక్కువగా ఆందోళన చెందుతున్న అంశాలను సైతం తెలుసుకునే ప్రయత్నం చేసింది. మహమ్మారి కారణంగా 79% మంది భారతీయులు ఆదాయం తగ్గిందని భావిస్తుంటే, మూడోవంతు మంది ఇప్పటికీ ఈ స్థితిని అనుభవిస్తున్నారు. 64% మంది భారతీయులు తమ జీవితంలో అత్యంత కీలకమైన మైలురాళ్లు అయినటువంటి పొదుపు పెంచుకోవడం, లీజర్‌ట్రావెలింగ్‌, చిన్నారులకు విద్యనందించడం వంటివి సైతం ప్రభావితమవుతున్నాయని భావిస్తున్నారు.

 
కోవిడ్-19తో పాటుగా దీని చుట్టూ ఉన్న అనిశ్చితి కారణంగా, ఆర్ధికంగా బలంగా ఉండాల్సిన ఆవశ్యకత పెరిగింది మరియు 57% మంది భారతీయులు ఫైనాన్షియల్‌ సెక్యూకిటీ మరియు స్వీయ/ఫ్యామిలీ స్థిరత్వం నిర్వహించాలని భావిస్తున్నారు.  మొత్తం ఆర్థిక ప్రణాళిక ప్రక్రియ పరంగా జీవితభీమా అత్యంత కీలకం అని 78% మంది భారతీయులు భావిస్తున్నారు. భీమా ఆవశ్యకత గుర్తించిన 46% మంది ఆరోగ్య భీమాను మరియు 44% మంది జీవిత భీమాను తొలిసారిగా కోవిడ్-19 సమయంలో తీసుకున్నారు. భారతీయులు భీమా అత్యంత కీలకమని భావిస్తున్నప్పటికీ, ఇప్పటికీ వారు భీమా పరంగా అతి తక్కువ మొత్తాలనే తీసుకుంటున్నారు. తమ వార్షిక ఆదాయానికి కేవలం 3.8 రెట్లు మాత్రమే భీమా ఉంటుంది.  సాధారణంగా ఇది 10 నుంచి 25 రెట్ల అధికంగా ఉండాల్సిన ఆవశ్యకత  ఉంది.

 
ఈ అధ్యయనం గురించి ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్సూరెన్స్‌, జోన్‌ 2 అధ్యక్షులు శ్రీ ఏవీఎస్‌ శివ రామకృష్ణ మాట్లాడుతూ, ‘‘ఎన్నో రూపాలుగా ఈ మహమ్మారి మన జీవితాలపై ఎన్నో రూపాలుగా ప్రభావితం చేస్తుంది. ప్రమాదాలను ఊహించడం, ప్రమాద ధోరణులు వంటివి వినియోగదారుల నడుమ నూతన అలవాట్లకు కారణమవుతున్నాయి. ఆర్ధిక ప్రణాళిక పట్ల వారి ఆసక్తి ఈ మారిన అలవాట్లు, మహమ్మరి అనంతర ప్రపంచంలో ప్రవర్తన కారణంగానే జరుగుతుంది. ఎస్‌బీఐ లైఫ్‌ యొక్క ఫైనాన్షియల్‌ ఇమ్యూనిటీ సర్వే 2.0 ఈ మార్పుకు గల కారణాలను అత్యుత్తమంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేసింది. మరీ ముఖ్యంగా ఈ కోవిడ్‌ అనంతర ప్రపంచంలో భౌతిక, ఆర్థిక ఇమ్యూనిటీ పరంగా మారిన వినియోగదారుల ప్రవర్తనకు కారణం తెలుసుకోవడం వీలయింది’’ అని అన్నారు.

 
ఆయనే మాట్లాడుతూ, ‘‘రాబోయే సంవత్సరాలలో, ఆర్థిక ప్రణాళికల వేళ వినియోగదారులు బీమాను కూడా ఓ భాగం చేసుకుంటారని ఆశిస్తున్నాము. తమతో పాటుగా తమ ప్రియమైనవారి కోసం సమగ్రమైన ఆర్ధిక ప్రణాళికను భారతీయులు చేసుకునేందుకు భారతీయులు స్ఫూర్తినొందారని అర్థమవుతుంది. ఆర్థిక ఉత్పత్తుల పరంగా మారుతున్న వినియోగదారుల ధోరణులు ఓ చక్కటి ధోరణిని సూచిస్తుండటంతో పాటుగా భవిష్యత్‌లో అనిశ్చితి వేళ పరిస్థితులను అధిగమించేందుకు సైతం అది తోడ్పడుతుంది’’ అని అన్నారు.

సంబంధిత వార్తలు

డీ-హైడ్రేషన్‌తో ఆస్పత్రిలో చేరిన షారూఖ్ ఖాన్..

Rave Party: నేనో ఆడపిల్లను, బర్త్ డే పార్టీ అంటే వెళ్లా, నాకేం తెలియదు: నటి ఆషీరాయ్

హారర్, యాక్షన్, సస్పెన్స్, థ్రిల్లర్ గా అదా శర్మ C.D సెన్సార్ పూర్తి

లవ్ మీ చిత్రం రీష్యూట్ నిజమే - అందుకే శనివారం విడుదల చేస్తున్నాం : ఆశిష్

మంచు లక్ష్మి ఆదిపర్వం పై సెన్సార్ ప్రశంస - ఐదు భాషల్లో విడుదల

చియా గింజలు తింటే ఎలాంటి ఉపయోగాలు?

రెక్టల్ క్యాన్సర్ రోగిని కాపాడేందుకు ట్రూబీమ్ రాపిడార్క్ సాంకేతికత: అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్

డ్రై ఫ్రూట్స్‌ను ఖాళీ కడుపుతో తింటే ఎంత లాభమో?

నారింజ పండ్లు తీసుకుంటే.. డీహైడ్రేషన్‌ పరార్.. గుండె ఆరోగ్యానికి మేలు..

పాలులో రొట్టె కలిపి తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments