Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రమాదంలో 32 ల‌క్ష‌ల డెబిట్ కార్డులు... ఇప్పటికే లక్షల కార్డులు బ్లాక్

దేశ వ్యాప్తంగా ఉన్న డెబిట్ కార్డుల్లో 32 లక్షల డెబిట్ కార్డుల పరిస్థితి ప్రమాదంలో ఉంది. ఈ కార్డులు సెక్యూరిటీ ఉల్లంఘ‌న‌లకు గురై ఉండొచ్చ‌ని బ్యాంకులు భావిస్తున్నాయి. తాము కొన్ని ల‌క్ష‌ల డెబిట్ కార్డుల‌

Webdunia
గురువారం, 20 అక్టోబరు 2016 (12:58 IST)
దేశ వ్యాప్తంగా ఉన్న డెబిట్ కార్డుల్లో 32 లక్షల డెబిట్ కార్డుల పరిస్థితి ప్రమాదంలో ఉంది. ఈ కార్డులు సెక్యూరిటీ ఉల్లంఘ‌న‌లకు గురై ఉండొచ్చ‌ని బ్యాంకులు భావిస్తున్నాయి. తాము కొన్ని ల‌క్ష‌ల డెబిట్ కార్డుల‌ను బ్లాక్ చేశామ‌ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్ర‌క‌టించిన ఒక రోజు త‌ర్వాత ఈ న్యూస్ రావ‌డం క‌స్ట‌మ‌ర్ల‌ను ఆందోళ‌న‌కు గురిచేస్తోంది. ముప్పు పొంచి ఉన్న కార్డుల్లో 26 ల‌క్ష‌లు వీసా, మాస్ట‌ర్‌ కార్డ్‌కు చెందిన‌వి కాగా.. 6 ల‌క్ష‌లు రూపేకి చెందిన‌విగా బ్యాంకు వ‌ర్గాలు తెలిపాయి. 
 
కాగా, ఈ కార్డుల్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ, ఎస్ బ్యాంక్‌, యాక్సిస్ బ్యాంక్ కార్డులే అధికంగా ఉన్నాయి. అయితే తాము అన్ని ఏటీఎమ్‌ల‌పై స‌మీక్ష నిర్వ‌హించామ‌ని, ఉల్లంఘ‌న‌లు జ‌రిగిన‌ట్లు గుర్తించ‌లేద‌ని ఎస్ బ్యాంక్ ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. కొన్ని కార్డుల‌కు ముప్పు పొంచి ఉంద‌ని కార్డ్ నెట్‌వ‌ర్క్ ప్రొవైడ‌ర్లు చెప్ప‌డంతో ముందు జాగ్ర‌త్త‌గా వాటిని మారుస్తున్న‌ట్లు ఎస్‌బీఐ బుధ‌వారం ప్ర‌క‌టించింది. 

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

ఇలాంటి అలవాట్లు తెలియకుండానే కిడ్నీలను డ్యామేజ్ చేస్తాయి

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments