Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేలల్లో ఉద్యోగావకాశాలు కల్పించనున్న ఇన్ఫోసిస్‌

Webdunia
గురువారం, 10 డిశెంబరు 2009 (14:00 IST)
నిరుడు ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక మాంద్యం కారణంగా సాఫ్ట్‌వేర్ కంపెనీలు ఉద్యోగులను తొలగించాయి. ప్రస్తుతం మాంద్యం క్రమక్రమంగా తగ్గుముఖం పడుతుండటంతో తమ వ్యూహాలు మార్చుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో దేశీయ సాఫ్ట్‌వేర్ దిగ్గజమైన ఇన్ఫోసిస్ టెక్నాలజీస్ సంస్థ దాదాపు 13 వేలమందిని కొత్తగా నియమించనుంది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పదమూడు వేలమందిని కొత్తగా ఉద్యోగాలలో తీసుకోవాలని ఇన్ఫోసిస్ సంస్థ నిర్ణయించిందని అమెరికాకు చెందిన ప్రముఖ వాణిజ్య పత్రిక వాల్‌స్ట్రీట్ జర్నల్ తెలిపింది.

అమెరికాలోని తమ సంస్థలో సిబ్బంది సంఖ్యను మరింత రెట్టింపు చేసుకుంటామని కంపెనీ ప్రకటించిందని, అమెరికాలో కొత్తగా వెయ్యిమందిని నియమించుకుంటామని ఇన్ఫోసిస్ అధికార వర్గాలు తెలిపినట్లు జర్నల్ పేర్కొంది. దీంతోపాటు మొత్తం 13 వేలమందిని కొత్తగా ఉద్యోగాలలో నియమించనుంది.

ఇదిలావుండగా ఇటీవలే దేశీయ సాఫ్ట్‌వేర్ కంపెనీ అయిన విప్రో టెక్నాలజీస్ సంస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 5 వేలమందిని కొత్తగా ఉద్యోగాల్లోకి తీసుకోనున్నట్లు ప్రకటించింది. కాగా తాజాగా ఇన్ఫోసిస్ టెక్నాలజీస్ సంస్థ ఉద్యోగావకాశాలు కల్పిస్తుందని ప్రకటించడంతో నిరుద్యోగుల్లో ఉత్సాహం నెలకొంది.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments