Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాంద్యం నుంచి గట్టెక్కాం : బ్రిటన్‌

Webdunia
బుధవారం, 27 జనవరి 2010 (14:35 IST)
ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక మాంద్యం నుంచి తమ దేశం గట్టెక్కినట్లేనని బ్రిటన్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.

ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక మాంద్యం కారణంగా పలు దేశాల్లోని వ్యాపార రంగాలు అతలాకుతలమైనాయి. ఇందులో భాగంగా బ్రిటన్‌లోను పలు ఆర్థిక సంస్థలు మాంద్యాన్ని చవిచూసాయి. రెండో ప్రపంచ యుద్ధం తరువాతి కాలంలో బ్రిటన్‌ చవిచూసిన అతి ఘోరమైన మాంద్యం నుంచి గట్టెక్కినట్లు అధికారికంగా ప్రకటించారు.

దేశంలో ప్రస్తుతం ఉన్న ఆర్థిక వృద్ధి రేటు నమ్మశక్యం కానివిధంగా 0.1 శాతం మాత్రమే నమోదు కావడం మరో నాలుగు నెలల్లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల నాటికి ప్రధాని గార్డన్‌ బ్రౌన్‌ నేతృత్వంలోని లేబర్‌ పార్టీని ఆశల పల్లకిలో ఊరేగించేటట్లు కనిపించడం లేదని స్థానిక రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.

గత సంవత్సరం ఆఖరి త్రైమాసికంలో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 0.1% మేరకు వృద్ధి చెందిందని ఆఫీస్‌ ఫర్‌ నేషనల్‌ స్టాటిస్టిక్స్‌ ఓ ప్రకటనలో వెల్లడించింది. గత 18 నెలలుగా బ్రిటన్‌ మాంద్యం గుప్పిట్లో విలవిలలాడింది.. ఆ కాలంలో ఉద్యోగాలు కోల్పోయిన వారి సంఖ్య 13 లక్షలకు చేరుకుందని అధికార వర్గాలు వెల్లడించాయి.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments