Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహాత్మా గాంధీ స్థాయికి మోడీని పోల్చిన అనిల్ అంబానీ!

Webdunia
FILE
గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీపై దేశీయ పారిశ్రామిక రంగం ప్రశంసల జల్లు కురిపించింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్మన్ ముఖేష్ అంబానీతోపాటు ఆయన సోదరుడు, అడాగ్ గ్రూప్ అధినేత అనిల్ అంబానీ, టాటా గ్రూప్ మాజీ అధినేత రతన్ టాటా పారిశ్రామిక రంగానికి మోడీ ఇస్తున్న ప్రాధాన్యతను కొనియాడారు.

పారిశ్రామికవేత్తల నుంచి పెట్టుబడులను ఆహ్వానిస్తూ నిర్వహిస్తున్న మూడు రోజుల గుజరాత్ సదస్సు శుక్రవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా ముఖేష్ అంబానీ మాట్లాడుతూ వౌలిక రంగ వసతుల కల్పనలో గుజరాత్ దేశంలోని ఇతర అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోందన్నారు.

రిలయన్స్‌ను గుజరాత్‌కు చెందిన సంస్థగా చెప్పుకోవడం గర్వకారణంగా ఉంటుందన్నారు. గుజరాత్‌లో 500 కోట్ల రూపాయల పెట్టుబడితో పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ్ పెట్రోలియం విశ్వవిద్యాలయం ఏర్పాటుకు కట్టుబడి ఉన్నామన్నారు.

అనిల్ అంబానీ మాట్లాడుతూ మహాత్మాగాంధీ, సర్దార్ పటేల్ స్థాయికి మోడీని పోల్చారు. అలాంటి గొప్పగొప్ప నాయకులతోపాటు తన తండ్రి ధీరూభాయ్ అంబానీ పుట్టిన ఈ గడ్డలోనే మోడీ జన్మించడం ఆనందంగా ఉందన్నారు.

అల్లు అర్జున్ క్లాసిక్ మూవీ ఆర్యకు 20 ఏళ్లు.. బన్నీ హ్యాపీ

ప్రతిదీ మార్కెట్ చేయడంలో రాజమౌళి నెంబర్ ఒన్ -- స్పెషల్ స్టోరీ

పురాణ యుద్ధ ఎపిసోడ్‌ కు 8 కోట్లు వెచ్చిస్తున్న స్వయంభు నిర్మాత

సమయ స్ఫూర్తి, ఆకట్టుకునే మాటతీరుతో టాప్ యాంకర్ గా దూసుకుపోతున్న గీతా భగత్

గేమ్ ఛేంజర్ కోసం వినూత్నప్రచారం చేయనున్న టీమ్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

Show comments