Webdunia - Bharat's app for daily news and videos

Install App

మళ్ళీ భారత్‌కు రానున్న ఈస్ట్ ఇండియా కంపెనీ

Webdunia
మంగళవారం, 9 ఫిబ్రవరి 2010 (15:51 IST)
భారతదేశంలో మళ్ళీ తన వ్యాపార కార్యకలాపాలను కొనసాగించేందుకు ఈస్ట్ ఇండియా కంపెనీ దేశంలో అడుగిడేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈస్ట్ ఇండియా కంపెనీ పేరు చెప్పగానే ప్రతి భారతీయుని గుండె రగిలిపోతుంది. గతంలో జరిగిన అవమానాలు, ఆత్మహత్యలు, దౌర్జన్యాలు, బానిసత్వం, తదితర అంశాలు గుర్తుకు వస్తాయి. తొలుత ఈ కంపెనీ వ్యాపార నిమిత్తం భారతదేశంలోకి ప్రవేశించి దాదాపు ఒక శతాబ్దం వరకు దేశాన్ని తన గుప్పిట్లో ఉంచుకుని మరీ పరిపాలించింది.

గతంలో వ్యాపారం పేరుతో భారతదేశంలో తన కార్యకలాపాలను విస్తరింపజేసి నిదానంగా దేశాన్నే తన హస్తగతం చేసుకున్న ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రస్తుతం మళ్ళీ తన వ్యాపారాన్ని భారతదేశంలో మరోమారు విస్తరింపజేసేందుకు ప్రణాళికలు రూపొందించుకుంది. కాని సదరు కంపెనీని భారతీయుడు కొనుక్కోవడం విశేషం. అతనే ఇప్పుడు ఏకంగా తన మాతృదేశంలో ఆ కంపెనీ పేరుతోనే వ్యాపారాన్ని ప్రారంభించేందుకు ప్రణాళికలు రూపొందిచుకున్నట్లు భారత సంతతికి చెందిన కంపెనీ యజమాని సంజీవ్ మెహతా తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తొలుత తమ కంపెనీ తేయాకు, కాఫీ, మసాలా దినుసుల వ్యాపారం చేస్తుండేదని, కాని వీటితో పాటు ఇప్పుడు తాజాగా ఊరగాయలు, చాకొలేట్లు, ఫర్నీచర్, చర్మంతో తయారు చేసిన వస్తువులు తదితరాలను భారతదేశంలో విక్రయిస్తామన్నారు.

కంపెనీ చరిత్ర

ఈస్ట్ ఇండియా కంపెనీని క్రీ.శ. 1600లలో మహారాణి ఎలిజబెత్ I స్థాపించారు. కంపెనీని స్థాపించిన ఐదు సంవత్సరాల తర్వాత వ్యాపార నిమిత్తం సదరు కంపెనీ భారతదేశంలోకి ప్రవేశించింది. క్రీ.శ. 1757లో ప్లాసీ యుద్ధం తర్వాత సదరు కంపెనీ భారతదేశంలో పరిపాలన కొనసాగించడం ప్రారంభించింది. కంపెనీ ద్వారా పాలన దాదాపు వంద సంవత్సరాలు అంటే క్రీ.శ 1857 వరకు కొనసాగింది. క్రీ.శ. 1857లో స్వాతంత్ర్యపు తొలి సమరం ప్రారంభమైంది. అయినప్పటికీ జనవరి 1, 1874లో భారతదేశాన్ని పరిపాలించే బ్రిటిష్ ప్రభుత్వం అధికారికంగా చాలా అధికారాలు తన వద్దనే ఉంచుకుంది.

ఆ సందర్భంలోనే కంపెనీలో అవాంతరాలు ఏర్పడ్డాయి. ఈలోపే కంపెనీ సామర్థ్యంతో ప్రపంచంలోని దాదాపు 50 శాతాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకుంది. క్రీ.శ. 1801లో కంపెనీ కార్యకలాపాల ఆదాయం దాదాపు 75 లక్షల పౌండ్లుగా ఉండింది. అదే ప్రస్తుత తారీఖుననుసరించి ఈ మొత్తం ధనరాశి 39 కోట్ల పౌండ్లు (28.5 వందల కోట్ల రూపాయలు)కు సరిసమానంగా ఉంటుంది.

భారత సంతతికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త సంజీవ్ మెహతా సదరు కంపెనీకి చెందిన అన్ని షేర్లను బ్రిటిష్ కార్యకాలాపాల నుంచి 2004లో కొనేశాడు. కంపెనీని మొత్తం రెండు కోట్ల పౌండ్ల ( దాదాపు 1.45 వందల కోట్ల రూపాయలు)కు కొనడం జరిగింది. దీంతో కంపెనీకి చెందిన గుత్తాధిపత్యం తన వశమైనట్లైంది. కంపెనీ పూర్వవైభవాన్ని మళ్ళీ తీసుకువచ్చేందుకు తాను కృషి చేస్తున్నట్లు మెహతా తెలిపారు.

కంపెనీని కొన్న తర్వాత దానిని మరింతగా విస్తరింపజేసేందుకు, కంపెనీలోని సమస్యలను పరిష్కరించేందుకు ఒక కోటి పౌండ్ల ( దాదాపు 73 కోట్ల రూపాయలు)ను ఖర్చు చేశాడు. కంపెనీ చరిత్రను పూర్తిగా అవగాహన చేసుకునేందుకు మెహతాకు ఆరు సంవత్సరాల కాలం పట్టింది. ఈ కాలంలో కంపెనీ విశేషాల గురించి ప్రపంచవ్యాప్తంగానున్న కంపెనీకి చెందిన శాఖలను అధ్యయనం చేశాడు.

బ్రిటన్‌కు చెందిన ఓ వార్తా పత్రికకు ప్రత్యేకంగా ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ తాను ఒక భారతీయునిగా ఉండటంతో చాలా గర్వపడుతున్నానన్నారు. ఎందుకంటే ఇదే కంపెనీ గతంలో తమ దేశాన్ని పరిపాలించిన కంపెనీకి తాను యజమానిగా ఉండటం గర్వంగా ఉందన్నారు. సదరు కంపెనీ యజమానిగా ప్రపంచవ్యాప్తంగా పర్యటించడం ఎంతో గర్వించదగ్గ విషయమని ఆయన అన్నారు.

కంపెనీకి తాను బ్రాండ్‌గా మారడంతో తనకు ప్రత్యేకమైన హోదా ఏదీ ఉండదని, ఇది చరిత్ర ఇచ్చిన గుర్తింపు అని ఆయన అభిప్రాయపడ్డారు. రానున్న 2015 నాటికి తమ కంపెనీ కార్యకలాపాలను విస్తరించి 6.5 కోట్ల పౌండ్ల ( దాదాపు 4.73 వందల కోట్ల రూపాయలు)కు చేరుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

రిటైల్ రంగంలో తమ వ్యాపార కార్యకాలాపాలను మరింతగా విస్తరింపజేసే దిశలో భాగంగా లండన్, భారతదేశం, మధ్యతూర్పు దేశాలలో అమ్మకాల కేంద్రాలను విస్తరింపజేస్తామన్నారు. ఈ ఔట్‌లెట్లలో తమ కంపెనీ తేయాకు, కాఫీ, మసాలా దినుసులు, ఫ్యాబ్రిక్స్ తదితర వస్తువులను అమ్ముతుందన్నారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments