Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రపంచం ఒక దార్శకుణ్ణి కోల్పోయింది: స్టీవ్ మృతిపై ఒబామా

Webdunia
గురువారం, 6 అక్టోబరు 2011 (18:21 IST)
యాపిల్ మాజీ సీఈఓ స్టీవ్ జాబ్స్ మృతిపై విచారం వ్యక్తం చేసిన అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రపంచం ఒక దార్శకుణ్ణి కోల్పోయిందన్నారు. అమెరికా అత్యంత గొప్ప ఆవిష్కర్తల్లో జాబ్స్ ఒకరని ఒబామా పేర్కొన్నారు.

" ప్రపంచం ఒక దార్శకుడిని కోల్పోయింది. వివిధ ఆవిష్కరణల ద్వారా స్టీవ్ సాధించిన విజయాలను నుంచి నేర్చుకోవడం కంటే ఆయనకు అర్పించే గొప్ప నివాళులు లేవు" అని జాబ్స్ మృతిచెందిన అనంతరం ఒబామా ఒక ప్రకటనలో తెలిపారు.

" స్టీవ్ జాబ్స్ మరణవార్త విని మిఛెల్, నేను తీవ్రంగా విచారించాం. అమెరికా గొప్ప ఆవిష్కర్తల్లో స్టీవ్ ఒకరు. విభిన్నంగా ఆలోచించే ధైర్యం వున్న స్టీవ్ ప్రపంచ గతిని మార్చగలనని నమ్మారు. అందుకనుగుణంగా తన ప్రతిభను ప్రదర్శించారు" అని ఒబామా చెప్పారు. ఒక గ్యారేజ్‌లో ఏర్పాటు చేసిన కంపెనీని భూమండలంలో అత్యంత విజయవంతమైన కంపెనీల సరసన చేర్చిన జాబ్స్ అంకితభావాన్ని ఒబామా కొనియాడారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments