Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెరిగిన డిమాండ్: పండగ సీజన్‌లో బంగారం ప్రియం!!

Webdunia
సోమవారం, 10 అక్టోబరు 2011 (12:42 IST)
పండుగ సీజన్‌లో దేశీయంగా డిమాండ్ గణనీయంగా పెరిగింది. దీంతో వచ్చే నెల రోజుల్లో బంగారం ధరలు మరింత ప్రియం కానున్నాయి. దీపావళి నాటికి కనీసం పది గ్రాముల బంగారం ధ ర 30 వేల రూపాయలకు పెరగవచ్చని బంగార వ్యాపార నిపుణులు అభిప్రాయడుతున్నారు.

దేశీయంగా డిమాండ్ అధికంగా ఉండడంతో దీపావళి నాటికి 10 గ్రాముల బంగారం ధర రూ.29,000 నుంచి రూ.30,000ల మధ్య ఉంటుందని అంచనా వేస్తున్నట్టు బాంబే బులియన్ అసోసియేషన్ అభిప్రాపడింది.

ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న అనిశ్చితికి ముగింపు కనబడకపోవడంతో పెట్టుబడులకు బంగారం మంచి గమ్యస్థానంగా మారినట్టు పేర్కొన్నారు. అయితే దేశీయ మార్కెట్లో అమ్మకాలు తక్కువగా ఉండడంతో 10 గ్రాముల బంగారం ధర రూ.25,970 నుంచి రూ.26,460 మధ్య ఉంటుందని బ్రోకరేజి సంస్థ మాయా ఐరన్ ఓర్ ఛైర్మన్ ప్రవీణ్ కుమార్ అభిప్రాయపడ్డారు.

ఐరోపాలో రుణ సంక్షోభం ఎక్కువ కావడంతో గత సెప్టెంబర్ నెలలో బంగారం ధరల్లో హెచ్చు తగ్గులు నమోదు చేసుకున్న విషయం తెల్సింద. ఆ నెలలో ఔన్స్ బంగారం ధర అత్యధికంగా 1,923.7 డాలర్లు, అతి తక్కువగా 1,535 డాలర్లకు చేరుకుంది.

అయితే ప్రపంచంలో భారతలోనే అత్యధికంగా బంగారాన్ని వినియోగిస్తున్నారనీ, జనవరి-జూన్ నెలలో 553 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకున్నామని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (డబ్ల్యూజీసీ) వెల్లడించింది. అదేవిధంగా డిమాండ్ అధికంగా ఉండడంతో ఈ ఏడాది బంగారం దిగుమతులు వెయ్యి టన్నులు దాటుతుందని, దీంతో పాటు ధరలు కూడా పెరిగే అవకాశం ఉన్నట్టు కౌన్సిల్ పేర్కొంది.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments