Webdunia - Bharat's app for daily news and videos

Install App

పటిష్టమైన కంపెనీల్లో టాటా స్టీల్ : ఫోర్బ్స్

Webdunia
గురువారం, 28 జనవరి 2010 (20:12 IST)
దేశంలోని అతి పెద్ద కంపెనీల్లో అగ్రగామిగానున్న రెండు కంపెనీలు పటిష్టవంతంగా ఉన్నాయని, అవి టాటా స్టీల్, హెచ్‌డీఎఫ్‌‍సీ సంస్థలని ఫోర్బ్స్ పత్రిక తన నివేదికలో వెల్లడించింది.

చాలా సంవత్సరాలుగా సంస్థ కార్యకలాపాలను కొనసాగిస్తూ పటిష్టవంతంగా నిర్వహిస్తున్న కంపెనీల గురించి ఫోర్బ్స్ పత్రిక టోరంటో (కెనడా)కు చెందిన మీడియా కంపెనీ కార్పోరేట్ నైట్స్ సంస్థ సహకారంతో సర్వే నిర్వహించింది. వీటిలో దాదాపు వంద కంపెనీలకు స్థానం కల్పించింది. ఇందులో రతన్ టాటాకు చెందిన టాటా స్టీల్ సంస్థకు 90వ స్థానం లభించగా గృహ రుణాలను అందించే కంపెనీల్లో అగ్రగామిగానున్న హెచ్‌డీఎఫ్‌సీ సంస్థకు 92వ స్థానం దక్కిందని ఫోర్బ్స్ పత్రిక వెల్లడించింది.

ఫోర్బ్స్ పత్రిక తెలిపిన వివరాల మేరకు టోరంటో (కెనడా)కు చెందిన మీడియా కంపెనీ కార్పోరేట్ నైట్స్ సంస్థ చాలా కాలంపాటు ప్రపంచవ్యాప్తంగానున్న పలు కంపెనీల స్థితిగతులను అంచనా వేసింది. కంపెనీకి చెందిన ప్రతి శాఖను క్షుణ్ణంగా పరిశీలించిన మీదటే వంద కంపెనీలను ఎంచుకున్నట్లు ఫోర్బ్స్ పత్రిక వెల్లడించింది.

ప్రపంచంలోనున్న కంపెనీల్లో కేవలం వంద కంపెనీలు మాత్రమే తమ పనితనంలో చక్కగా సేవలందిస్తున్నాయని, వీటిలో అమెరికాకు చెందిన జనరల్ ఎలక్ట్రిక్ సంస్థ ప్రథమ స్థానం పొందిన కంపెనీగా గుర్తింపు పొందింది. ఆ తర్వాత సాన్‌ఫ్రాన్సిస్కోకు చెందిన యుటిలిటీ కంపెనీ పసిఫిక్ గ్యాస్, ఎలక్ట్రిక్ కార్ప్ సంస్థలు వరుసగా స్థానాలను పొందినట్లు ఫోర్బ్స్ పత్రిక వెల్లడించింది.

అలాగే నెదర్‌లాండ్‌కు చెందిన మేల్ డెలివరీ కంపెనీ టీఎన్‌టీ ఎన్‌వీ, స్వీడన్‌కు చెందిన హెచ్ అండ్ ఎమ్ హేన్స్ అండ్ మీరిటిస్ పేర్లున్నాయి. ఇతర కంపెనీలు ఫిన్‌ల్యాండ్‌కు చెందిన నోకియా, జర్మనీకి చెందిన సీమెన్స్ ఏజీ, అమెరికాకు చెందిన యూనిలివర్, వోడాఫోన్ తదితర కంపెనీలున్నాయని ఫోర్బ్స్ పత్రిక తెలిపింది.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments