Webdunia - Bharat's app for daily news and videos

Install App

నానోతో పోటీకి సిద్ధమౌతున్న కొత్త ఆల్టో

Webdunia
మంగళవారం, 19 జనవరి 2010 (11:18 IST)
దేశీయ కార్ల నిర్మాణ రంగంలో అగ్రగామిగానున్న మారుతి సుజుకీ సంస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి కొత్త మోడల్ ఆల్టో, వాగన్ ఆర్‌లను దేశీయ ఆటో మోటార్ మార్కెట్లో విడుదల చేసేందుకు సన్నహాలు చేస్తోంది.

కొత్త ఆల్టో కారులో 1 లీటరు సామర్థ్యం గల కె- సిరీస్ ఇంజన్‌ను, వాగన్ ఆర్‌కు 1.2 లీటర్ల కె- సిరీస్ ఇంజన్‌‌ను అమర్చనున్నట్టు మారుతి కంపెనీ ప్రకటించింది. ఈ రెండు కార్ల డిజైన్లను మార్చనున్నట్టు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. కాగా మారుతి స్విఫ్ట్‌కు మార్చి నుంచి 1.2 లీటర్ల సామర్థ్యం కలిగిన పెట్రోలు ఇంజన్‌ను అమర్చనున్నట్టు ఆ ప్రకటనలో వెల్లడించింది.

కొత్త ఆల్టోతో టాటా మోటార్స్‌కు చెందిన నానో కారుకు పోటీ ఇవ్వాలని మారుతి సుజుకి సిద్ధమవుతోంది. 2011 నాటికి నానోకు పోటీగా కొత్త ఆల్టోను రూ 1.4 లక్షల నుంచి రూ 2 లక్షల మధ్య ధరకు మార్కెట్లో తన వినియోదారులకు అందజేసేందుకు మారుతి కంపెనీ ప్రణాళికలు సిద్ధం చేస్తోందని మారుతి సంస్థ ఆ ప్రకటనలో వివరించింది.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments