Webdunia - Bharat's app for daily news and videos

Install App

దుబాయ్‌లో అత్యంత పెద్ద కార్గో విమానాశ్రయం: పాల్

Webdunia
బుధవారం, 5 మే 2010 (15:03 IST)
FILE
ప్రపంచంలోనే అత్యంత పెద్ద కార్గో విమనాశ్రయాన్ని దుబాయ్‌లో జూన్ 27న ప్రారంభించనున్నట్లు దుబాయ్ విమానాశ్రయ ప్రధాన కార్యనిర్వహణాధికారి పాల్ గ్రిఫ్ఫిత్స్ బుధవారం దుబాయ్‌లో మీడియాకు తెలిపారు.

దుబాయ్‌లోని అల్-మక్దూమ్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రపంచంలోనే అత్యంత పెద్ద కార్గో విమానాశ్రయంగా రూపొందించి, నిర్మిస్తున్నామని ఆయన తెలిపారు. ఈ ఏడాది జూన్ 27న కార్గో విమానాశ్రయాన్ని ప్రారంభిస్తామని, అదే వచ్చే ఏడాది ప్రయాణీకులు దిగేందుకు వీలుగా విమానాశ్రయాన్ని మరికొంత పునరుద్ధరించి ప్రారంభించేందుకు ప్రణాళికలు రూపొందించుకున్నామని ఆయన వెల్లడించారు.

ప్రయాణీకులు వచ్చి, పోయేందుకు వీలుగా టెర్మినల్‌ నిర్మాణాన్ని ఈ ఏడాది చివరి నాటికి పూర్తి చేసుకుంటుందని ఆయన అన్నారు. వచ్చే సంవత్సరం(2011) వేసవి సెలవులు ప్రారంభమయ్యే మార్చి నెల నాటికి పూర్తిగా ప్రయాణీకుల సేవలతోపాటు కార్గో సేవలు అందుబాటులోకి వస్తాయని ఆయన అన్నారు.

విమానాశ్రయంలో మొత్తం ఆరు రన్‌వేలను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఇందులో భాగంగా మొత్తం 120 మిలియన్ ప్రయాణీకులు వచ్చిపోయేందుకు అనువుగా నిర్మించామన్నారు. రన్ వే నిర్మాణపు పనులు 2007 నుంచి ప్రారంభమయ్యాయన్నారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments