Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమిళనాడులో రూ.500 కోట్లు పెట్టుబడి పెట్టనున్న బోచ్

Webdunia
శనివారం, 3 సెప్టెంబరు 2011 (16:44 IST)
ప్రపంచంలో గృహోపకరణాల వస్తు ఉత్పత్తిలో అగ్రగామిగా ఉన్న బోచ్ సంస్థ తమిళనాడులో 500 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చింది. ఈ మొత్తం సీమెన్స్ గ్రూపు భాగస్వామ్యంతో కలిసి చెన్నయ్‌లో ఉత్పత్తి యూనిట్‌ కోసం ఖర్చు చేయనుంది. ఇప్పటికే, శామ్‌సంగ్ కంపెనీ శ్రీపెరంబదూర్ వద్ద నెలకొల్పిన ప్లాంట్ కోసం వంద మిలియన్ డాలర్లను వెచ్చించింది.

అలాగే, చోళవరం వద్ద ప్యానాసోనిక్ కంపెనీ, ఫాక్స్‌కాన్, ఫ్లెక్స్‌ట్రానిక్స్ కంపెనీలు కూడా తమతమ వస్తువుల ఉత్పత్తి కోసం కొత్త ప్లాంట్‌లను నెలకొల్పాయి. ఇపుడు శ్రీపెరంబుదూరు సమీపంలోని పిల్లైప్పాక్కం వద్ద ఏర్పాటు చేసిన సిప్‌కాట్ ఇండస్ట్రియల్ పార్క్‌లో ఏర్పాటు చేసే ఉత్పత్తి ప్లాంట్ కోసం రూ.479.27 కోట్ల మేరకు పెట్టుబడి పెట్టనుంది.

ఇందుకోసం 42 ఎకరాల స్థలాన్ని కేటాయించాల్సిందిగా బోచ్ కంపెనీ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. శుక్రవారం జరిగిన ఒక కార్యక్రమంలో ముఖ్యమంత్రి జయలలితను కలిసి బోచ్ కంపెనీ ప్రతినిధులు వినతి పత్రం సమర్పించారు. కాగా, బోచ్ కంపెనీ ఎయిర్ కండిషనర్లు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషన్లు వంటి గృహోపకరణ వస్తువులను ఏర్పాటు చేయనుంది.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments