Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.1,21,000 కోట్లతో రైల్వే బడ్జెట్.. భద్రతా ప్రమాణాల పెంపునకు హై టెక్నాలజీ... ట్విట్టర్లో ప్రభు బడ్జెట్ మినిట్ టు మినిట్...

సురేష్ ప్రభు రైల్వే బడ్జెట్... సామాజిక నెట్వర్కింగ్ సైట్లలో మినిట్ టు మినిట్ మోత...

Webdunia
గురువారం, 25 ఫిబ్రవరి 2016 (12:32 IST)
లోక్‌సభలో కేంద్ర రైల్వే మంత్రి సురేశ్ ప్రభు 2016-17 సంవత్సరానికిగాను వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఆయన తన ప్రసంగ పాఠంలో రూ.1,21,000 కోట్లతో రైల్వే బడ్జెట్‌ను రూపొందించినట్టు చెప్పారు. ముఖ్యంగా గత 2015లో రూ.8,720 కోట్లు పొదుపు చేసినట్టు వెల్లడించారు. 2016లో రూ.1,84,820 కోట్లను లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెప్పారు. 
 
అంతేకాకుండా, రెవెన్యూ, విధానాలు, సంస్థాగత నిర్మాణం అనే మూడు అంశాల ప్రాతిపదికపై దృష్టిసారించినట్టు తెలిపారు. 2016 రైల్వే బడ్జెట్ ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొస్తుందన్నారు. 2016 -17లో 92 శాతం ఆపరేటింగ్ రేషియో సాధిస్తామని ధీమాను వ్యక్తం చేశారు. రెవెన్యూను పెంచుకునేందుకు కొత్త మార్గాలు అన్వేషిస్తున్నట్టు చెప్పారు. అదేసమయంలో ఇది అత్యంత సవాళ్ళతో కూడుకున్న సమయమన్నారు. రైల్వే రంగంలో సామర్థ్యం పెంపుదల కోసం రూ.1.25 లక్షల కోట్ల వరకు కొత్త బడ్జెట్లో కేటాయించవచ్చని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు. 
 
మన ప్రయాణంలో మార్పునకు ఈ బడ్జెట్‌ సాక్ష్యంగా నిలుస్తుందన్నారు. దేశంలోని మిలియన్ల కొద్దీ సామాన్యులను తాకుతూ ఈ ప్రయాణం సాగుతుందన్నారు. 2008 -14 నుంచి 8 శాతంగానే రైల్వే వృద్ధి అంచనాలు. గతేడాది అంతకు రెండు రెట్లు ఎక్కువ వృద్ధి సాధించినట్టు తెలిపారు. భారతీయులంతా గర్వపడే రైల్వే వ్యవస్థను అందించాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. సేవల నుంచి సౌకర్యాల వరకు అన్ని విభాగాల్లో రైల్వే ముందంజ వేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. భద్రతా ప్రమాణాల పెంపునకు అత్యాధునిక సాంకేతికత వినియోగించుకుంటున్నట్టు చెప్పారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

స్టోరీ, స్క్రీన్‌ప్లే సరికొత్తగా కౌలాస్ కోట చిత్రం రూపొందుతోంది

హైద‌రాబాద్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల‌కు హీరో కృష్ణసాయి సాయం

థ్రిల్లర్ అయినా కడుపుబ్బా నవ్వించే షోటైం: నవీన్ చంద్ర

Dil Raju: మా రిలేషన్ నెగిటివ్ గా చూడొద్దు, యానిమల్ తో సినిమా చేయబోతున్నా: దిల్ రాజు

మార్గన్ లాంటి చిత్రాలు చేసినా నాలో రొమాంటిక్ హీరో వున్నాడు : విజయ్ ఆంటోని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: కాలిఫోర్నియా బాదంతో చర్మం చక్కదనం

Monsoon: వర్షాకాలంలో నిద్ర ముంచుకొస్తుందా? ఇవి పాటిస్తే మంచిది..

Breakfast: స్కూల్స్‌కు వెళ్లే పిల్లలు బ్రేక్ ఫాస్ట్ తీసుకోకపోతే.. ఏం జరుగుతుందో తెలుసా?

ఆవు నెయ్యి అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

గుండెపోటు సంకేతాలు నెల ముందే కనిపిస్తాయా?

Show comments