Webdunia - Bharat's app for daily news and videos

Install App

2016 రైల్వే బడ్జెట్: దేశాభివృద్ధికి వెన్నెముకలా ఉంటుంది: సురేశ్ ప్రభు

Webdunia
గురువారం, 25 ఫిబ్రవరి 2016 (12:13 IST)
2016 రైల్వే బడ్జెట్ సామాన్యుల ఆశలు ప్రతిఫలించేలా ఉంటుందని కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేశ్ ప్రభు అన్నారు. లోక్ సభలో సురేశ్ ప్రభు గురువారం మధ్యాహ్నం 12 గంటలకు బడ్జెట్ ప్రవేశపెట్టారు. ప్రజల అంచనాల్ని, కోరికల్ని దృష్టిలో ఉంచుకుని ఈ బడ్జెట్‌ని తయారు చేశామన్నారు. ఇది పూర్తిగా ప్రజల బడ్జెట్‌ అంటూ వ్యాఖ్యానించారు. కలిసికట్టుగా కృషి చేసి రైల్వేల్ని మరింత ఉన్నతంగా తీర్చి దిద్దుతామని చెప్పారు.
 
రైల్వేలో కొత్త ఆలోచన, కొత్త ఆదాయ మార్గాల ప్రాతిపదికన బడ్జెట్‌ను రూపొందించడం జరిగిందని సురేశ్ ప్రభు వ్యాఖ్యానించారు. బడ్జెట్ సందర్భంగా మాజీ ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్ పేయి కవితను చదివి చూపించారు. దేశాభివృద్ధికి వెన్నెముకలా ఉండేలా బడ్జెట్‌ను రూపొందించామన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో రైల్వే పనితీరును మెరుగుపరుస్తామని, ఈ బడ్జెట్ ప్రజల జీవితాల్లో మార్పులు తెస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments