Webdunia - Bharat's app for daily news and videos

Install App

పైసా రాక...పోక కథాకమామీషు

బడ్జెట్ తొలిసారిగా పది లక్షల కోట్లకుపైగా

Webdunia
దేశీయ బడ్జెట్ లెక్కలు తొలిసారిగా పది లక్షల కోట్ల రూపాయలకుపైగా చేరుకుంది. ఇంత పెద్ద మొత్తంలో ప్రతి రూపాయిలోనుంచి ప్రతి పైసా ఎక్కడినుంచి వస్తోంది. అలాగే ప్రతి పైసా ఎక్కడికి పోతోందనేదానిపై కథాకమామీషు.

కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ సోమవారంనాడు ప్రవేశపెట్టిన ప్రస్తుత ఆర్థిక బడ్జెట్‌ననుసరించి ప్రతి రూపాయిలో 34పైసలు రుణాలు, ఇతర మార్గాల ద్వారా వస్తోంది. అదే కార్పోరేటు పన్ను ద్వారా 22 పైసలు మరియు వ్యక్తిగత ఎక్సైజ్ సుంకాల ద్వారా 9పైసలు వసూలవుతోంది.

అదే ఆదాయ పన్ను ద్వారా 9 పైసలు, సేవలు, ఇతర పన్నుల ద్వారా 5పైసలు, పన్నేతర ఆదాయం ద్వారా 12పైసలు, కస్టమ్స్ సుంకంద్వారా 8పైసలు రాగా రుణేతర మూల ధన రాబడి ఒక పైసా వసూలవుతోంది.

మరోవైపు ప్రభుత్వపు ఖర్చుపై దృష్టిని సారిస్తే ప్రతి రూపాయిలో ఇరవై పైసలు కేంద్ర ప్రణాళికలకు ఖర్చు చేస్తుంటారు. 19 పైసలు రుణాలపై చెల్లించాల్సిన వడ్డీ రేట్లను చెల్లిస్తారు. అదే 12పైసలను దేశ రక్షణకు వెచ్చిస్తారు.

ప్రతి ఒక్క రూపాయిలో 14పైసలు వివిధ పన్నులు, సుంకాల్లో రాష్ట్రాల వాటాకింద ఖర్చు చేస్తారు. అదే మరో 14పైసలను ఇతర ప్రణాళికేతర వ్యయానికి ఖర్చు చేస్తారు.

అలాగే మరో పది పైసలను ఆర్థిక సబ్సిడీల కొరకు కేటాయిస్తారు. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ప్రణాళిక సాయంకింద 7 పైసలు ఖర్చు చేస్తారు. కాగా మరో నాలుగు పైసలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ప్రణాళికేతర సాయంకింద ఖర్చు చేస్తారు.

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

Show comments