Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగు టాకీ వెలుగు నీడలు

Webdunia
బుధవారం, 26 నవంబరు 2008 (01:29 IST)
తెలుగు సినిమాల చరిత్ర గురించి ఇంతవరకు ఎన్నో పుస్తకాలు వచ్చాయి. ఎన్ని వచ్చినా మళ్లీ కొత్త పుస్తకాలలో మన తెలుగు సినిమాల గురించి మరింత కొత్త సమాచారం వస్తూనే ఉంది. తెలుగు టాకీ వెలుగు నీడలు గురించి తాజాగా పాత్రికేయుడు పిఎస్ రావు అందించిన సమాచారం ఆసక్తికరంగా రూపొందింది. తెలుగు సినిమా ప్రస్థానంలో పౌరాణిక, చారిత్రక, సామాజిక ఇతివృత్తాలతో కూడిన మూడు దశలను ఈ పుస్తకంలో పొందుపరిచారు.

తెలుగు సినీరంగంలో 1931 నుంచి 2006 వరకు చోటు చేసుకున్న ఎన్నో మార్పులను ఈ పుస్తకం వివరిస్తోంది. 1950-70 మధ్య కాలంలో తెలుగు చలన చిత్ర క్షేత్రంలో పురస్కారాల పంట పండింది. మరోవైపు అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలలో సైతం తెలుగు చిత్రాలు తమ ప్రత్యేకతను చాటుకుంటూనే వచ్చాయి.

తెలుగులో చారిత్రక, పౌరాణికాల ప్రాబల్యం 1931-40 కాలంలో కొట్టొచ్చినట్లు కనిపించగా 1941-51 మధ్య కాలంలో వచ్చిన స్వర్గ సీమ చిత్రం ఓ కొత్త వరవడిని దిద్దింది. మల్లీశ్వరి, మాయాబజార్, నర్తనశాల, శ్రీ సీతారామ కళ్యాణం, దేవదాసు వంటి మేటి చిత్రాలు దీనివెనుకే వరుసగా వచ్చాయి.

1951-60 ల కాలంలో తెలుగులో సాంఘిక చిత్రాలు ఊపందుకున్నాయి. ఎంతో మంది ప్రతిభా వంతులైన నటీనటులుఈ కాలంలోనే వెలుగు చూశారు. ఇలాంటి మరెన్నో విశేషాలతో పాటు 1931 నుంచి 2006 దాకా విడుదలైన తెలుగు చిత్రాల విశేషాలు సవివరంగా రచయిత పిఎస్ రావు అందించారు.

అలనాటి తెలుగు సినిమాల వెలుగు నీడలను పరిశీలించాలనుకునే వారు తప్పక చదవాల్సిన పుస్తకంగా ఇది రూపొందింది. పేజీలు. 66, వెల రూ.50. ప్రతులకు విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్

ఒకవైపు ఓడిపోతున్నా, చివరి రౌండ్ల వరకూ చూడంటారు, హహ్హహ్హ: ప్రశాంత్ కిషోర్

చీరకట్టులో స్పోర్ట్స్ ‌బైకుపై దూసుకెళ్లిన వరంగల్ ఆంటీ ... అవాక్కమైన మగరాయుళ్లు!! (Video Viral)

ఛత్తీస్‌గఢ్‌లో లోయలోపడిన వాహనం - 17 మంది మృతి

గుర్తుపట్టలేని విధంగా ఇరాన్ అధ్యక్షుడి మృతదేహం? అక్కడ తోడేళ్లు వున్నాయట

వారంలో ఎక్కువ రోజులు కెఫీన్ తాగుతున్న యువత..

రేవ్ పార్టీలో పట్టుబడ్డ అతడెవరో నాలాగే వున్నాడు: శ్రీకాంత్ మేకా

అబ్బాయిలూ ఇలా అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తే చెంపలు చెళ్లుమంటాయి

పాయల్ రాజ్‌పుత్ పైన రక్షణ నిర్మాత ఫిలిం ఛాంబర్‌కు ఫిర్యాదు

దీక్షిత్ శెట్టి క్రైమ్ కామెడీ థ్రిల్లర్ టైటిల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి

మల్లె మొగ్గ సక్సెస్ స్ఫూర్తితో యాక్షన్ ఎంటర్ టైనర్ గా వస్తోన్న తథాస్తు చిత్రం

Show comments