Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెల్లుల్లి రసాన్ని తలకు పట్టిస్తే..?

Webdunia
సోమవారం, 21 జనవరి 2019 (14:23 IST)
ఆడామగా తేడా లేకుండా అందరిని బాధపెడుతున్న సమస్య హెయిర్ ఫాల్. అత్యధికులు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. అయితే హెయిల్ ఫాల్ కోసం భారీగా ఖర్చు పెట్టక్కర్లేదు. అందుబాటులో ఉండే వస్తువులే అద్భుత ఔషధాలుగా పనిచేస్తాయి. ఉల్లి, వెల్లుల్లి, బంగాళాదుంప, కొత్తిమీర, క్యారెట్ల సాయంతో జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చని బ్యూటీషన్లు అంటున్నారు. 
 
1. తాజా వెల్లుల్లి గడ్డల నుంచి రసాన్ని తీసి మాడుకు పట్టించాలి. తద్వారా జట్టు ఆరోగ్యంగా ఉండడమే కాకుండా ఒత్తుగా పెరుగుతుంది. 
 
2. ఉల్లిపాయ పేస్ట్‌తో జ్యూస్ తయారుచేసి అందులో 2 స్పూన్ల తేనె కలపాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి 40-50 నిమిషాలపాటు ఉంచాలి. ఆపై గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి. ఇలా తరచు చేస్తే జుట్టు రాలకుండా ఉంటుంది.
 
3. తరిగిన తాజా కొత్తిమీరకు కొద్దిగా నీరు కలిపి పేస్టులా తయారుచేసి మాడుకు అప్లై చేయాలి. గంటసేపటి తరువాత శుభ్రంగా కడిగేయాలి. 
 
4. కొన్ని క్యారెట్లను బాగా ఉడికించాలి. వాటిని ఉడికించిన నీటితో సహా మెత్తగా రుబ్బాలి. ఆ పేస్ట్‌ను తలకు పట్టించి అరగంట తరువాత తలస్నానం చేయాలి.
 
5. మూడు బంగాళాదుంపలను మెత్తగా రుబ్బుకుని మెత్తని గుజ్జులా చేసి దానికి ఓ స్పూన్ తేనె, గుడ్డు పచ్చసొన, కొంచెం నీరు కలిపి ఆ మిశ్రమాన్ని తలకు పూయాలి. ఇలా చేస్తే జుట్టు ప్రకాశవంతంగా మారడమే కాకుండా ఒత్తుగా పెరుగుతుంది.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments