Webdunia - Bharat's app for daily news and videos

Install App

అందమైన గోళ్ల కోసం... కొన్ని చిట్కాలు

Webdunia
శనివారం, 25 అక్టోబరు 2014 (12:45 IST)
మహిళల సౌందర్యంలో గోళ్లు ముఖ్య పాత్రను వహిస్తున్నాయి. నేడు గోళ్ల సంరక్షణకు, గోళ్ల సౌందర్యానికి బ్యూటీ పార్లర్ లలో మిని క్యూర్, పెడి క్యూర్ అంటూ అనేక రకమైన విధానాలు అందుబాటులోకి వచ్చాయి. అయితే అవి అన్ని ఖర్చుతో కూడినవి. అందమైన గోళ్లను పొందాలంటే కొన్ని చిట్కాలు పాటిస్తే సరి. 
 
అసలు అమ్మాయిలు గోళ్లు కొరికే అలవాటును మానుకోవాలి. గోళ్లను ఇష్టానుసారం కత్తిరించడం, తుంచడం వంటివి మానేస్తే వాటిని అందంగా తీర్చిదిద్దుకునే అవకాసం ఉంటుంది. మంచి మాయిశ్చరైజింగ్ లోషన్‌తో రోజూ గోళ్లకు మసాజ్ చేసుకోవాలి. గోళ్ల వద్ద రక్త ప్రసరణ సవ్యంగా జరిగితే అవి బలంగా, పొడవుగా పెరిగే వీలుంటుంది. తద్వారా గోళ్లను తగిన విధంగా తీర్చిదిద్దుకోవచ్చు.
 
మహిళలు రోజూ వీలైనన్ని ఎక్కువసార్లు మంచి నీళ్లు తాగితే చర్మం పగిలిపోకుండా ఉంటుంది. గోళ్లు కూడా ఆరోగ్యవంతంగా ఉంటాయి. విటమిన్లు, కాల్షియం పుష్కలంగా లభించే ఆహారాన్ని తీసుకుంటే గోళ్లు అందంగా పెరుగుతాయి.
 
సమయం కుదిరినప్పుడు రాత్రి పడుకునే ముందు కొద్దిగా ఆలివ్ ఆయిల్‌ను వేళ్లకు అద్దుకొని గోళ్లు, గోళ్ల చుట్టూ, వేళ్లపైన మర్దనా చేయాలి. ఆలివ్ ఆయిల్‌కు బదులుగా పాలనూ వాడవచ్చు. రోజూ ఈ విధంగా చేస్తే గోళ్లకు జీవకళ వస్తుంది. గోళ్ల చుట్టూ ఉన్న చర్మానికి విటమిన్ 'ఇ' అంది ఆ భాగమంతా మృదువుగా తయారవుతుంది. గోళ్ల సందుల్లో మురికిని తొలగించడానికి సూదులు, అగ్గి పుల్లలు వంటివి వాడడం మంచిది కాదు.

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

Show comments