అందంగా వుండాలంటే.. ఏం చేయాలో తెలుసా?

అందంగా వుండాలంటే.. నీళ్లు ఎక్కువగా తాగండి.. అంటున్నారు.. ఆరోగ్య నిపుణులు. నీటిని అధికంగా సేవించడం ద్వారా వ్యాధికారక క్రిములు నశిస్తాయి. శరీరంలోని మలినాలు తొలగిపోతాయి. తద్వారా చర్మానికి రక్షణ ఏర్పడుతుం

Webdunia
సోమవారం, 1 అక్టోబరు 2018 (11:08 IST)
అందంగా వుండాలంటే.. నీళ్లు ఎక్కువగా తాగండి.. అంటున్నారు.. ఆరోగ్య నిపుణులు. నీటిని అధికంగా సేవించడం ద్వారా వ్యాధికారక క్రిములు నశిస్తాయి. శరీరంలోని మలినాలు తొలగిపోతాయి. తద్వారా చర్మానికి రక్షణ ఏర్పడుతుంది. దీంతో ఇన్ఫెక్షన్లు, మొటిమలు ఏర్పడవు. అలాగే అందంగా వుండాలంటే.. రోజు ఒక్కసారైనా కలబంద తీసుకుని, దానిని ముఖానికి పట్టించాలి.
 
ఇంట్లో కలబంద మొక్కలోని జెల్‌ను ముఖానికి అప్లై చేయడం ద్వారా చర్మం మెరిసిపోతుంది. అలాగే సహజమైన కలబంద లాగానే ఐస్ ముక్కలు తీసుకుని ముఖానికి పట్టించి, కాసేపటి తరువాత శుభ్రం చేసుకుంటే కాంతివంతమైన చర్మాన్ని పొందవచ్చు.
 
అందం కోసం రోజు ఆహారంలో వెల్లుల్లి చేర్చుకోవాలి. ఇవి చర్మంలోని కణాల కాలాన్ని పెంచి, చర్మాన్ని ఎంతో తాజాగా, యవ్వనంగా ఉంచుతుంది. నిమ్మరసం, తేనె చర్మ సౌందర్యానికి ఎంతో మంచిది. రెండు టేబుల్ స్పూన్లు నిమ్మరసం, ఒక టేబుల్ స్పూన్ తేనె ఈ రెండింటిని కలిపి, ముఖానికి పట్టించి, ఒక 20 నిమిషాల తరువాత శుభ్రం చేసుకోవాలి, ఇలా రోజు చేస్తే మెరుగైన చర్మం పొందుతారు. 
 
రోజూ లేత కొబ్బరి కాయ నీరు తాగితే మీ చర్మ సౌందర్యానికి ఎంతో ఉపయోగ పడుతుంది. రోజు నారింజ రసం తాగడం ద్వారా చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు. ఇందులోని విటమిన్ సి చర్మ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

మన్యం జిల్లాలో నిప్పుల కుంపటి.. ముగ్గురు బలి..

రీల్స్ కోసం నిప్పంటించారు.. గాలి జనార్ధన్ రెడ్డి ఇంట అగ్నిప్రమాదం.. ఎనిమిది మందిపై కేసు

నల్గొండ జిల్లాలో ఘోస్ట్ స్కూల్స్... 315 పాఠశాలల్లో నో స్టూడెంట్స్

అమెరికా చరిత్రలోనే తీవ్రమైన మంచు తుఫాను.. పలు విమానాలు రద్దు

నగరిలో చంద్రబాబు పర్యటన.. పది పైసలకు ప్రయోజనం లేదు.. రోజా ఫైర్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శంబాల లో నాకు అద్భుతమైన పాత్ర దక్కింది, నటుడిగా గుర్తింపునిచ్చింది : శివకార్తిక్

మర్దానీ 3 ట్రైలర్ నన్ను కదిలించిందన్న హర్మన్‌ ప్రీత్ కౌర్

మగాడిపై సానుభూతి కలిగించేలా పురుష: నుంచి కీరవాణి పాట

విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న చిత్రం వీడీ 14 టైటిల్ ప్రకటన

స్వయంభు కోసం టాప్ విఎఫ్ఎక్స్ కంపెనీలు ముందుకు వచ్చాయ్

తర్వాతి కథనం
Show comments