Webdunia - Bharat's app for daily news and videos

Install App

పట్టులా మెరిసే జుట్టు కోసం... ఉల్లి మేలు..!

Webdunia
బుధవారం, 18 ఫిబ్రవరి 2015 (14:24 IST)
అమ్మాయిల అందానికి అందాన్ని చేర్చేది జుట్టు. ఆ జుట్టు పట్టులా మెరవాలంటే హెయిర్ ప్యాక్స్ వేయాలి. మార్కెట్‌లో లభించే ప్యాక్స్‌లో జుట్టుకు హాని కలిగించే రసాయనాలుంటాయి. కాబట్టి వాటి బదులుగా తక్కువ ఖర్చులో ఇంట్లోనే హెయిర్ ప్యాక్ తయారు చేసుకోవచ్చు. వీటి వల్ల జుట్టు సమస్యలు తొలగిపోవడంతోపాటు శిరోజాలు అందంగా తయారవుతాయి.
 
ఒక పెద్ద సైజు ఉల్లిపాయను మిక్సీలో వేసి రసం తీయాలి. దీనికి రెండు టీ స్పూన్ల తేనె కలపాలి. ఉల్లి వాసన పోయేందుకు కొన్ని చుక్కల రోజ్ వాటర్ కూడా కలుపుకుని జుట్టుకు పట్టించాలి. తర్వాత 40 - 50 నిమిషాలాగి కడిగేసుకోవాలి. ఇలా చేస్తే జుట్టు కండిషన్ అవుతుంది. మంచి మెరుపును సంతరించుకుంటుంది.
 
వెల్లుల్లి రసం వల్ల కూడా వెంట్రుకలు బాగా పెరుగుతాయి. వెల్లుల్లిలో ఉండే సల్ఫర్ చర్మం అడుగున కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది. ఫలితంగా కుదుళ్ళు వెంట్రుకల పెరుగుదలను ప్రేరేపిస్తాయి. అందుకే జుట్టును పెంచే ఉత్పత్తుల్లో సల్ఫర్‌ను ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. ఈ విధంగా ఉల్లి, వెల్లుల్లితో పట్టులాంటి జుట్టు మీ సొంతం అవుతుంది. ట్రై చేసి చూడండి. 
 

అమెరికా రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ విద్యార్థుల మృతి.. తెలుగమ్మాయి..?

రాయలసీమలో ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు.. అలెర్ట్

ఏపీలో హింసాత్మక ఘటనలు.. ఈసీ సీరియస్.. చర్యలు

టీడీపికి ఓటేశామన్నందుకు తలలు పగులగొట్టారు, ఎక్కడ?

చంద్రబాబుకి భద్రత పెంచిన కేంద్ర ప్రభుత్వం

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

Show comments