Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెదవులు పొడిబారకుండా ఉండాలంటే?

పెదవులు పొడిబారకుండా ఉండాలంటే చిటికెడు వెన్నలో కాస్త తేనెను కలుపుకుని రాత్రి పడుకునే ముందుగా పెదవులకు రాసుకోవాలి. ఇలా వారానికి రెండుసార్లు చేయడం వలన పెదవులు మృదువుగా ఉంటాయి. వేడి నీళ్లలో వేపాకులు వేసి స్నానం చేస్తే దురదలు తగ్గిపోతాయి. స్పూన్ కీరదోసకా

Webdunia
గురువారం, 12 జులై 2018 (12:47 IST)
పెదవులు పొడిబారకుండా ఉండాలంటే చిటికెడు వెన్నలో కాస్త తేనెను కలుపుకుని రాత్రి పడుకునే ముందుగా పెదవులకు రాసుకోవాలి. ఇలా వారానికి రెండుసార్లు చేయడం వలన పెదవులు మృదువుగా ఉంటాయి. వేడి నీళ్లలో వేపాకులు వేసి స్నానం చేస్తే దురదలు తగ్గిపోతాయి. స్పూన్ కీరదోసకాయ రసంలో చిటికెడు చందనం కలుపుకోవాలి.
 
ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 20 నిమిషాల తరువాత కడిగితే చర్మం నునుపుగా మారుతుంది. స్పూన్ తేనెలో కోడిగుడ్డులోని తెల్లసొనను కలిపి ముఖానికి, మెడకు రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో కడుక్కోవాలి. ఇలా చేయడం వలన జిడ్డు తగ్గి చర్మం అందంగా తయారవుతుంది.
 
రాళ్ల ఉప్పుని కాస్త నీళ్లలో కలుపుకోవాలి. స్ప్రే బాటిల్లో నిల్వ చేసుకుని ఎప్పుడు అవసరమైతే అప్పుడు ముఖంపై స్ప్రే చేసి తుడుచుకోవాలి. ఇలా చేయడం వలన ఫేస్ ఫ్రెష్ గా కనిపిస్తుంది. కళ్ల కింద నల్లటి వలయాలు ఉంటే గోరువెచ్చని నీటిలో ఉప్పు కలుపుకోవాలి. ఆ నీళ్లలో దూదిని ముంచి కళ్ల మీద పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల మెరుగైన ఫలితాలు పొందవచ్చు. చర్మం తడిగా ఉన్నప్పుడు శరీరంపై ఉప్పు చల్లుకుని సున్నితంగా స్క్రబ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల డెడ్ స్కిన్ సెల్స్ తొలగిపోతాయి. 
 
ఉప్పు, లవంగనూనె, ఆలివ్ ఆయిల్ తీసుకుని బాగా కలిపి శరీరానికి రాయాలి. కాసేపటి తరువాత స్నానం చేయాలి. దీనివల్ల చర్మంపై ఉండే మురికి మొత్తం పోయి శరీరం కాంతివంతంగా మారుతుంది. ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో కొద్దిగా ఉప్పు వేసి కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒక నిమిషం పాటు నోటిలో వేసుకుని పుక్కిలించాలి. దీంతో దంతాల నొప్పి, నోటి పూత వంటివి పోతాయి. అలాగే మెరిసే పళ్లు పొందడానికి, నోటి దుర్వాసన దూరం చేయడానికి ఉప్పు సహాయపడుతుంది.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments