జిడ్డు చర్మాన్ని తొలగించాలంటే.. ఏం చేయాలో తెలుసా..?

Webdunia
శుక్రవారం, 21 డిశెంబరు 2018 (10:41 IST)
ఈ చలికాలం వచ్చిందంటే చాలు.. ముఖం ఏదో పోయినట్టు కనిపిస్తుంది. ఇంకా చెప్పాలంటే.. నీరసంగా, నిద్రలేమితో ఉన్నట్టు కూడా కనిపిస్తుంది. ఇలా ఉన్నప్పుడు నలుగురిలో తిరగాలంటే చాలా కష్టంగా ఉందని కొందరు భావిస్తున్నారు. అలాంటి వారికి నిమ్మకాయ చాలా ఉపయోగపడుతుంది. నిమ్మకాయ ఎక్కడైనా దొరికేదే.. కనుక.. దీంతో ఫేస్‌ప్యాక్స్ వేసుకోవచ్చు...
 
నిమ్మకాయ ఫేస్‌ప్యాక్స్:
ముఖం జిడ్డుగా ఉన్నవారికి మొటిమలు ఎక్కువగా వస్తుంటాయి. ఇలా ఉన్నప్పుడు ముఖాన్ని చూడడానికే విసుగుగా ఉంటుంది. ఈ సమస్యను తొలగించాలంటే.. ఏం చేయాలో చూద్దాం.. స్పూన్ నిమ్మరసంలో కొద్దిగా తేనె, స్పూన్ వంటసోడా కలిపి పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్ వేసుకుని 20 నిమిషాల పాటు అలానే ఉంచాలి. ఆ తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే ముఖం మొటిమలు తొలగిపోయి కాంతివంతంగా తయారవుతుంది.
 
నిమ్మలోని విటమిన్ సి చర్మంపై గల మృతుకణాలను తొలగించి చర్మాన్ని తాజాగా మార్చుతుంది. పావుకప్పు నిమ్మరసంలో రెండు స్పూన్ల చక్కెర వేసి బాగా కలుపుకోవాలి. ఈ పేస్ట్‌ను ముఖానికి అప్లై చేయాలి. ఈ ప్యాక్ బాగా ఆరిన తరువాత 5 నిమిషాల పాటు ముఖాన్ని మర్దన చేయాలి. ఆపై నీటితో శుభ్రం చేసుకుంటే మృతుకణాలు తొలగిపోయి ముఖం ప్రకాశవంతంగా మారుతుంది.
 
కొబ్బరి నూనె చర్మానికి కావలసిన తేమను ఇస్తుంది. కనుక.. కొబ్బరి నూనెతో జిడ్డు చర్మాన్ని తొలగించవచ్చును. 2 స్పూన్ల కొబ్బరి నూనెలో, స్పూన్ నిమ్మరసం, వంటసోడా కలిపి మెత్తని మిశ్రమంలా చేసుకోవాలి. ఈ పేస్ట్‌ను ముఖానికి పట్టించి.. 15 నిమిషాల తరువాత వేడినీళ్లతో కడుక్కోవాలి. ఇలా చేస్తే ముఖం కొత్తగా మెరిసిపోతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

అదృశ్యమైన 11 గంటల్లోనే నాలుగేళ్ల బాలుడిని కాపాడిన పోలీసులు

సంగారెడ్డి జిల్లా దారుణం : మహిళను పొదల్లోకి ఈడ్చుకెళ్లి భర్త కళ్లముందే హత్య

Pawan Kalyan: సేన గళం అనే కమిటీ ఏర్పాటు చేసిన పవన్ కల్యాణ్

ఒకటిన్నర ఏళ్ల పసికందుకు చిత్ర హింసలు.. తల్లి చూస్తుండగానే ప్రియుడు..?

ఇరాన్‌తో అణు ఒప్పందం.. తుది నిర్ణయం తీసుకోని డోనాల్డ్ ట్రంప్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tollywood Exibitors war : ఎగ్జిబిటర్ల మధ్య వార్ - దిల్ రాజు మనుషులు బెదిరింపు !

Shruti Haasan: గ్రామస్తుల వింత పరిస్థితికి సింగ్ గీతం నుంచి ఏమైంది' సాంగ్

పోలీస్ కంప్లైంట్ లో కృష్ణ సినిమాల‌ను గుర్తు చేస్తూ ప్ర‌త్యేక‌ పాట‌

Charan: జీవితాంతం దాచుకునే సినిమాల్లో పెద్ది ఒకటి : రామ్ చరణ్

Allu Aravind : అల్లు రామలింగయ్య పేరిట గది నిర్మాణానికి అల్లు అరవింద్ విరాళం

తర్వాతి కథనం
Show comments