Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్కిన్ కేర్ అండ్ హెయిర్ కేర్‌గా పనిచేసే ఎగ్!

Webdunia
మంగళవారం, 28 అక్టోబరు 2014 (16:50 IST)
కోడిగుడ్డు ఆహారంగా తీసుకోవడం ద్వారా ఆరోగ్య ప్రయోజనాలెన్నో ఉన్నట్లే... సౌందర్య పోషణలోనూ కోడిగుడ్డు దివ్యౌషధంగా పనిచేస్తుంది. చర్మానికి, శిరోజాల సంరక్షణలో కోడిగుడ్డు సూపర్‌గా పనిచేస్తుందని బ్యూటీషన్లు అంటున్నారు.
 
ఒక కోడిగుడ్డు తీసుకుని, దానిలోని సొనని ముఖానికి పట్టించి అరగంట తర్వాత గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే, చర్మం గట్టిపడడమే కాకుండా, కాంతివంతంగా తయారవుతుంది. 
 
గుడ్డులోని తెల్ల సొనని తీసుకుని, కొంచెం కొబ్బరి నూనె కలిపి, బాగా మిక్స్ చేసి ముఖానికి, మెడకి పట్టించాలి, తరువాత గోరు వెచ్చని నీటితో కడిగేసుకోవాలి, ఇలా చేస్తే  చర్మము జిడ్డు లేకుండా కాంతివంతంగా అవుతుందియ. 
 
గుడ్డులోని పచ్చ సొనలో కొంచెం తేనె, పెరుగు కలిపి మీ ముఖానికి పట్టించి, 20 నిమిషాల తరువాత శుభ్రం చేసుకుంటే, మెరిసే అందమైన చర్మం మీ సొంతం అవుతుంది.
 
కేశసంరక్షణ కోసం.. ఒక గుడ్డు, పెరుగు, 1 స్పూన్ ఆలీవ్ నూనె, కొంచెం బాదం నూనె కలిపి, ఈ మిశ్రమాన్ని మీ జుట్టుకి పట్టించి 45 నిమిషాల తరువాత గోరు వెచ్చని నీటితో శుబ్రం చేసుకుంటే, మిల మిల మెరిసే జుట్టు మీ సొంతం అవుతుంది.
 
అలాగే కొంచెం నిమ్మరసం తీసుకుని, గుడ్డుని కలిపి మీ జుట్టుకి పూర్తిగా పట్టించాలి, ఒక అరగంట తరువాత మీ షాంపూతో తలస్నానం చేస్తే హెయిర్ ఫాల్ ఉండదని సౌందర్య నిపుణులు అంటున్నారు.

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

Show comments