ముఖ చర్మాన్ని మృదువుగా, సున్నితంగా ఉంచుకోవడానికి...

Webdunia
శనివారం, 20 జులై 2019 (20:37 IST)
1. చర్మం సున్నితంగా ఉండాలంటే కొద్దిగా టమోటో గుజ్జులో నిమ్మరసం వేసి బాగా మిక్స్ చేసి ముఖానికి పట్టించి అరగంట తర్వాత శుభ్రం చేసుకుంటే వేడితాపాన్ని తగ్గించి చర్మాన్ని దృఢంగా ఉంచుతుంది.
 
2. టమోటోను తీసుకొని వాటిని బాగా గుజ్జులా తయారుచేసి అందులో కొద్దిగా ఓట్ మీల్ మరియు ఒక చెంచా పెరుగు కలిపి, ఈ మిశ్రమాన్ని ముఖానికి మెడకు అప్లై చేయాలి. అరగంట తర్వాత చల్లటి నీటితో శుభ్రచేసుకోవాలి. ఇలా చేయడం వల్ల సన్ టాన్ తొలగించి చర్మం మెరిసేలా చేస్తుంది.
 
3. వెల్లుల్లిని చిదిమి, దాని నుండి రసాన్ని వేరు చేయండి. దీనిని ఒక శుభ్రమైన గిన్నెలోకి తీసుకుని అందులో, తాజా కలబంద గుజ్జును జోడించి కలపండి మొటిమలు మీద రాసి , 10 నుండి 15 నిమిషాల  తర్వాత సాధారణ నీటితో శుభ్రపరచాలి. ఇలా చేయడం వల్ల మొటిమల సమస్య తగ్గుతుంది.
 
4. ఒక క్యారెట్‌ని తురుముకుని కొంచెం నీరు పోసి ఉడకపెట్టాలి. చల్లారిన తరువాత కొంచెం పాలు కలిపి మిశ్రమంలా తయారుచేసుకోవాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి అరగంట ఆగిన తరువాత చల్లని నీటితో కడిగివేయాలి. ఇలా చేయడం వల్ల మీ ముఖం కాంతివంతంగా, మృదువుగా తయారవుతుంది.
 
5. ఒక టీస్పూన్ కొబ్బరినూనెలో ఒక టీస్పూన్ బేకింగ్ సోడా వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి చేతివేళ్లతో సున్నితంగా మర్దనా చేయాలి. 10 నిముషాల తరువాత ముఖాన్ని శుభ్రంగా కడిగివేయాలి. ఇలా చేయడం వల్ల ముఖంపై ఉన్న జిడ్డు తొలగిపోతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రికి హెచ్చరిక చేసిన కాంగ్రెస్ సీనియర్ నేత

రాజధాని అమరావతిపై ఏపీ ప్రజల భావన మారాలి.. చంద్రబాబు

పెళ్ళయి నెలకే గుట్టపై నుంచి పడి నవ వధువు మృతి

రౌడీయిజం - దౌర్జన్యం చేయడానికే వైకాపా నేతల అమరావతి యాత్ర : హోం మంత్రి అనిత

వల్లభనేని వంశీ ఇలా అయిపోయారేంటి? వీడియో వైరల్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అవి ఐటమ్ సాంగ్‌లు కాదు... ప్రత్యేక డ్యాన్స్ నంబర్లే : తమన్నా

మరోమారు సందడి చేయనున్న పుష్ప రాజ్ - శ్రీవల్లి జోడీ

మొన్ననే గోవాలో కలిశాను... ఆప్యాయంగా మాట్లాడారు : భాగ్యరాజ్ మృతిపై చిరంజీవి

తమిళ దిగ్గజ నటుడు కె.భాగ్యరాజ్య ఎలా చనిపోయారంటే...?

ఖుష్బూ సుందర్ కుమార్తె పెళ్లికి వెళ్లొచ్చారు.. గుండెపోటుతో భాగ్యరాజ్ కన్నుమూత (video)

తర్వాతి కథనం
Show comments