Webdunia - Bharat's app for daily news and videos

Install App

అలోవెరా జెల్‌లో అందమైన పెదాలు..

అలోవెరా జెల్‌ని తీసి ఒక కంటైనర్‌లో నిల్వచేయాలి. ప్రతిరోజూ లిప్‌బామ్‌ లాగా ఈ జెల్‌ని రాసుకోవాలి. రోజులో ఒకసారి కాకుండా వీలుకుదిరినప్పుడల్లా రాసుకోవడం వల్ల మృదువైన పెదాలను పొందుతారు. అలోవెరాలో మంచి ఔషద

Webdunia
గురువారం, 12 జనవరి 2017 (19:37 IST)
అలోవెరా జెల్‌ని తీసి ఒక కంటైనర్‌లో నిల్వచేయాలి. ప్రతిరోజూ లిప్‌బామ్‌ లాగా ఈ జెల్‌ని రాసుకోవాలి. రోజులో ఒకసారి కాకుండా వీలుకుదిరినప్పుడల్లా రాసుకోవడం వల్ల మృదువైన పెదాలను పొందుతారు. అలోవెరాలో మంచి ఔషద గుణాలు ఉన్నాయి. అందువల్ల పగిలిన పెదాలను బాగుచేస్తుంది. కొత్త చర్మకణాలను ఉత్పత్తి చేస్తుంది.
 
దానిమ్మ గింజలను మిక్సీలో వేసి జ్యూస్‌ చేసుకోవాలి. దానిమ్మ జ్యూస్‌లో దూదిని ముంచి పెదాలకు రాసుకోవాలి. ఇలా ప్రతిరోజూ చేయడం వలన మంచి రంగుని పొందుతారు. పాలల్లో గులాబీ రేకులను రాత్రంతా నానపెట్టాలి. మరుసటి రోజు వాటిని మెత్తగా రుబ్బుకోవాలి. వచ్చిన పేస్ట్‌లో కొన్ని చుక్కలు పాలు కలిపి పెదాలకు రాసుకోవాలి. ఇలా వలన పాలలో బ్లీచింగ్‌ గుణాలు, గులాబీ రేకులలో యాంటి ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు పెదాలను కాంతివంతంగా చేసి సహజమైన రంగుని అందిస్తాయి. 
 
తేనెలో సగం చెంచా నిమ్మరసం వేసి బాగా కలపాలి. ఈ ప్యాక్‌ని పెదాలకు వేసుకుని 15 నిమిషాలపాటు ఉంచుకోవాలి. తరువాత మెత్తటి వస్త్రంతో పెదాలను తుడుచుకుని, మాయిశ్చరైజర్‌ ని పెదాలకు రాసుకోవాలి. ప్రతిరోజూ ఇలా చేయడంవల్ల పింక్‌ లిప్స్‌ మీ సొంతమవుతాయి. 

గర్భంతో ఉన్న శునకాన్ని కత్తితో పొడిచి చంపేసిన కసాయి!!

బీహార్‌లో విషాదం : నలుగురు ప్రాణాలు తీసిన రీల్స్ సరదా!!

భారత్ చర్యల కారణంగానే పాకిస్థాన్ భిక్షాటన దుస్థితి : యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్

తిరుమలలో ఒక్కసారిగా పెరిగిన భారీ రద్దీ!!

ఇండియా కూటమి అధికారంలోకి వస్తే అగ్నివీర్ పథకం రద్దు : రాహుల్ గాంధీ

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

తర్వాతి కథనం
Show comments