Webdunia - Bharat's app for daily news and videos

Install App

అల్లం పేస్ట్‌లో తేనె కలిపి మాడుకు పట్టించి...?

Webdunia
గురువారం, 21 మార్చి 2019 (13:03 IST)
చుండ్రును పోగొట్టుకోవడం కోసం చాలామంది రసాయనాలున్న షాంపూల్ని వాడుతుంటారు. అలాకాకుండా ఇంట్లో దొరికే వస్తువులతోనే చుండ్రును పోగొట్టుకోవచ్చు. జుట్టును ఓ సారి తడిపాక, అరచేతిలో బేకింగ్ సోడా తీసుకుని మాడుకు మర్దన అయ్యేట్లు బాగా రుద్దాలి. ఇది మాడుపై ఉన్న ఫంగస్‌ను తొలగిస్తుంది. అయితే బేకింగ్ సోడాతో రుద్దిన తరువాత షాంపూ వాడకూడదు.
 
మాడుకి అయిదు చెంచాల కొబ్బరి నూనెను రాత్రి పడుకునే ముందు బాగా పట్టించాలి. ఉదయం తక్కువ గాఢత కలిగిన షాంపూతో తలస్నానం చేయాలి. ఇలా ప్రతి మూడు రోజులకోసారి చేస్తే ఫలితం ఉంటుంది. 
 
రెండు చెంచాల నిమ్మరసాన్ని మాడుకు తగిలేలా రాసుకుని 5 నిమిషాలయ్యాక షాంపూతో కడిగేసుకోవాలి. ఆ తరువాత కప్పు నీళ్లలో స్పూను నిమ్మరసం వేసి జుట్టకు పట్టించి వదిలేయాలి. నిమ్మలోని ఆమ్లతత్వం చుండ్రు పట్టకుండా చూస్తుంది. 
 
అల్లం ముక్కని పేస్ట్‌లా చేసి, దానికి కాస్త తేనె కలిపి మాడుకి పట్టించి కాసేపయ్యాక కడిగేసుకోవాలి. అల్లంలోని యాంటీ ఫంగల్ లక్షణాలు చుండ్రుకి కారణమైన బ్యాక్టీరియాని తొలగిస్తాయి. జుట్టుని మృదువుగా మారుస్తాయి.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments