Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెడిక్యూర్ ఎలా చేస్తారు?

చాలామంది మహిళలు లేదా పురుషులు తమ ముఖసౌందర్యానికి ఇచ్చినంత ప్రాధాన్యత వారి కాళ్ళకు ఇవ్వరు. ముఖాన్ని ఎంత శుభ్రంగా ఉంచుకుంటారో.. కాళ్లు చేతులను కూడా అంతే శుభ్రంగా ఉంచుకోవడం కూడా అంతే ముఖ్యం.

Webdunia
మంగళవారం, 10 జులై 2018 (10:24 IST)
చాలామంది మహిళలు లేదా పురుషులు తమ ముఖసౌందర్యానికి ఇచ్చినంత ప్రాధాన్యత వారి కాళ్ళకు ఇవ్వరు. ముఖాన్ని ఎంత శుభ్రంగా ఉంచుకుంటారో.. కాళ్లు చేతులను కూడా అంతే శుభ్రంగా ఉంచుకోవడం కూడా అంతే ముఖ్యం.
 
ముఖ్యంగా స్నానం చేసేటప్పుడు కాళ్ళపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. కాళ్ళలో చేరుకున్న మురికి, కాలివేళ్లల్లో చేరుకున్న మురికిని తొలగించుకునేందుకు స్నానం చేసేటప్పుడు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. దీనికి పెడిక్యూర్ సరైన విధానంగా చెప్పుకోవచ్చు. 
 
* ఒక టబ్‌లో గోరువెచ్చని నీటిని నింపండి. అందులో షాంపూ, హైడ్రోజన్ పెరాక్సైడ్, అమ్మోనియం కలుపుకుని 15-20 నిమిషాలపాటు మీ కాళ్ళను అందులో ఉంచండి. దీంతో కాళ్ళ పగుళ్ళలో చేరుకున్న మురికి బయటకు వచ్చేస్తుంది. 
 
* 15-20నిమిషాల తర్వాత కాళ్ళను శుభ్రమైన నీటితో కడిగి మెత్తటి తువాలుతో తుడవాలి. ఇప్పుడు ఫైలర్‌తో గోళ్ళకు ఓ షేప్ ఇవ్వండి.
 
* క్యూటికల్ కట్టర్‌తో గోళ్ళకు ఇరువైపులా ఉన్న చర్మాన్ని కట్‌చేసి శుభ్రపరచండి. గోళ్ళలోవున్న మురికిని కూడా శుభ్రపరచండి. 
 
* స్క్రబర్‌తో మీ పాదాలను స్క్రబింగ్ చేసి కాళ్ళకు విటమిన్ "ఈ"కు చెందిన క్రీముతో మసాజ్ చేయండి.
 
* కాళ్ళను మరింత అందంగా తీర్చిదిద్దుకునేందుకు మీ కాలి గోళ్ళకు నెయిల్ పెయింట్ వేయండి. దీంతో కాళ్ళు అందంగా కనపడుతాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

తితిదే ఈవో బంగ్లాలో దూరిన పాము - పట్టుకుని సంచెలో వేస్తుండగా కాటేసింది...

పెళ్లికి నిరాకరించిన ప్రేమించిన వ్యక్తి.. అతని ఇంటిపై నుంచి దూకి యువతి ఆత్మహత్య!

భార్యల వివాహేతర సంబంధాలు, భర్తలను చంపడం ఎందుకు? విడాకులు తీసుకోవచ్చు కదా?

మహిళా ఉద్యోగులకు ఏపీ సర్కారు గుడ్ న్యూస్.. ఏంటది?

డీఎస్సీ నోటిఫికేషన్‌- 42 ఏళ్ల నుంచి 44కి వయోపరిమితి పెంపు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

దక్షిణాదిలో గుడికట్టాలంటూ డిమాండ్ చేస్తున్న బాలీవుడ్ హీరోయిన్! (Video)

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

తర్వాతి కథనం
Show comments