Webdunia - Bharat's app for daily news and videos

Install App

వర్షాకాలంలో కాలి గోళ్ళను శుభ్రం చేస్తున్నారా?

Webdunia
సోమవారం, 29 సెప్టెంబరు 2014 (18:15 IST)
వర్షాకాలంలో కాలి గోళ్ళను శుభ్రం చేస్తున్నారా..? కాలిగోళ్ళను శుభ్రంగా ఉంచుకోవడంతో ఇన్ఫెక్షన్లు, జ్వరం, జలుబు నుంచి దూరంగా ఉంటారని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇలాంటి అనారోగ్య సమస్యల నుంచి మనల్ని మనం రక్షించుకోవాలంటే కొన్ని టిప్స్ పాటించండి. 
 
ముందుగా కాలిగోళ్ళను పొట్టిగా ఉంచాలి. గోళ్ళను పొట్టిగా ఉంచడం ద్వారా శుభ్రంగా ఉంచడమే కాకుండా.. చాలా చక్కగా నీట్‌గా కనబడతాయి. 
 
కాలి గోళ్ళను శుభ్రం చేసేందుకు గోళ్ళ బ్రష్‌ను వాడండి. ఇది సున్నితంగా మృత చర్మ కణాలను, మొత్తం మురికిని గోళ్ళ నుండి తొలగిస్తుంది. 
 
గోళ్ళను కత్తిరించినప్పుడు అవి సమంగా శుభ్రంగా కనపడేటట్టు చూడండి, ఎందుకంటే సమంగా లేని గోళ్ళు అసహ్యంగా వికారంగా కనబడతాయి.
 
వర్షాల్లో తడిచినట్లైతే స్నానం చేస్తున్నప్పుడు కాళ్ళను కడగడం మర్చిపోకండి. కాళ్ళను శుభ్రం చేసేటప్పుడు సబ్బును ఉపయోగించండి.  కానీ పాదాలకు మాత్రం సున్నితమైన సబ్బును వాడండి. గోరు చుట్టూ ఉన్న ప్రదేశాన్నే కాక కాలి వేళ్ళను, పాదాలను కూడా శుభ్రం చేయడానికి ప్రయత్నించండి.
 
చివరగా, కాలి గోళ్ళు శుభ్రంగా, తాజాగా కనపడడానికి, గోరు రంగుతో ఉన్న నైల్ పాలిష్‌ను వాడితే, అవి కొత్తగా కనపడతాయి. ప్రతి వారం దాన్ని తొలగించి తిరిగి వాడితే ఫలితం ఉంటుంది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

కర్ణుడు చావుకు వంద కారణాలు అన్నట్టుగా వైకాపా ఓమిటికి బోలెడు కారణాలున్నాయ్... బొత్స

అధికారులు - కాంట్రాక్టర్ నిర్లక్ష్యమే అప్పన్న భక్తులను చంపేసింది .. అందుకే వేటు!

నల్లమల అడవుల్లో ఒంటరిగా వెళ్లొద్దంటున్న అధికారులు.. ఎందుకు?

భారత్ ఆ పని చేస్తే పూర్తిస్థాయి యుద్ధానికి దిగుతాం : పాక్ ఆర్మీ చీఫ్ మునీర్

పెళ్లి పల్లకీ ఎక్కాల్సిన వధువు గుండెపోటుతో మృతి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆరోగ్యంగా కులసాగానే ఉన్నాను .. రెగ్యులర్ చెకప్ కోసమే ఆస్పత్రికి వెళ్లా : ఉపేంద్ర క్లారిటీ

తెరచాప సినిమా కోసం ఆసుపత్రిపాలయ్యేవిధంగా కష్టపడ్డారు : 30 ఇయర్స్ పృద్వి

ఎఫ్1 వీకెండ్‌ మియామిలో రానా దగ్గుబాటి, లోకా లోకా క్రూ సందడి

తమిళ దర్శకుడిగా తెలుగు సినిమా చేయడం చాలా ఈజీ : డైరెక్టర్ కార్తీక్ రాజు

త్రిషకు పెళ్ళయిపోయిందా... భర్త ఆ యువ హీరోనా?

Show comments