Webdunia - Bharat's app for daily news and videos

Install App

మొటిమలకు చెక్ పెట్టాలా? సున్నిపిండి ప్యాక్ వేసుకోండి!

Webdunia
శుక్రవారం, 18 జులై 2014 (16:10 IST)
అమ్మాయిలను ప్రధానంగా బాధించే సమస్యల్లో ఒకటి మొటిమలు. వాటివల్ల భరించలేని నొప్పితో పాటు.. ముఖం అందవిహీనంగా కనిపిస్తుంది. దీంతో వారు తమ స్నేహితుల మధ్య కలిసిమెలసి ఉండలేక లోలోపల నరకయాతన అనుభవిస్తుంటారు. పైపెచ్చు.. మొటిమలు తగ్గినచోట మచ్చలు ఏర్పడి జీవితాంతం బాధిస్తూనే ఉంటాయి. 
 
ఇలాంటి వాటిని తగ్గించేందుకు గృహ చిట్కాలకు పాటిస్తే కొంతమేరకు ఉపశమనం పొందవచ్చని బ్యుటీషియన్లు అభిప్రాయపడుతున్నారు. శెనగపిండిలో పెరుగు కలిపి పేస్ట్‌లా తయారు చేసి ముఖానికి పట్టించాలి. ఇది 20 నిమిషాల పాటు అలానే ఉంచి ఆ తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి. తరచుగా ఇలా చేస్తే మొటిమలు తగ్గుతాయని వారు చెపుతున్నారు. 
 
అలాగే, ఉల్లిరసంలో కొంచెం తేనె కలపాలి. దీన్ని మొటిమల మచ్చలపై రాయాలి. గంట తర్వాత సున్నిపిండితో కడిగితే మంచి ఫలితం లభిస్తుంది. ఇవేకాకుండా, గులాబీ రేకులు, బచ్చలి ఆకులు నూరి ముఖానికి రాసుకుని అర్థ గంట తర్వాత చల్లని నీటితో కడగాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే మొటిమల బాధ నుంచి కొంతమేరకు ఉపశమనం పొందవచ్చని బ్యుటీషియన్లు అభిప్రాయపడుతున్నారు. 
 
ఒక స్పూన్ మెంతులపొడి, ఒక స్పూన్ పసుపుపొడి, దోసకాయగుజ్జు, ఒక స్పూన్ టమోట రసం, కొబ్బరినీళ్లు కలిపి ముఖానికి రాయాలి. 20 నిమిషాల తర్వాత చల్లని నీటితో కడగాలి. మెంతికూర, వేపాకు చిగుళ్లు, పసుపు కలిపి నూరాలి. 
 
ఈ మిశ్రమాన్ని ముఖానికి పెట్టి ఐదు నిమిషాల పాటు మసాజ్ చేయాలి. అరగంట తర్వాత చల్లని నీటితో కడిగేయాలి. ఇలా వారానికి రెండు లేక మూడు సార్లు చేస్తే మొటిమలు, వాటి తాలూకు మచ్చలు మాయమవుతాయని వారు చెపుతున్నారు.

చోటు లేదని కారు టాప్ పైన ఎక్కి కూర్చున్న యువతి, రద్దీలో రయ్యమంటూ ప్రయాణం

కదులుతున్న బస్సులో మంటలు- తొమ్మిది మంది సజీవదహనం

ఖమ్మం: తల్లి, ఇద్దరు పిల్లలను హత్య చేసిన వ్యక్తి.. భార్య కూడా?

సాధారణ మహిళలా మెట్రోలో నిర్మలా సీతారామన్ జర్నీ.. వీడియో వైరల్

కేరళలో విజృంభిస్తున్న హెపటైటిస్ ఏ- 12 మంది మృతి.. లక్షణాలు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

Show comments