Webdunia - Bharat's app for daily news and videos

Install App

సౌందర్యాన్ని పెంచే సుగంధ ద్రవ్యం.. గంధం ఫేస్ ఫ్యాక్

Webdunia
శుక్రవారం, 18 సెప్టెంబరు 2015 (16:27 IST)
మహిళలు తమ సౌందర్యాన్ని మరింత రెట్టింపు చేసుకునేందుకు వివిధ రకాలైన ఫేస్ ప్యాక్‌లను వాడుతుంటారు. మరికొందరు బ్యూటీపార్లర్లను ఆశ్రయిస్తుంటారు. అయితే, పూజా విధానాల్లో, పండుగలనాడు మాత్రమే చెంపలకు వాడే గంధం ఎంతో ముఖ్యమైన ఫేస్ ప్యాక్. ఈ విషయాన్ని ఏ ఒక్కరూ పెద్దగా పట్టించుకోరు. ఇందులో ఔషధతత్వాలు మెండుగా ఉన్నాయి. అలాంటి గంధం ఫేస్ వ్యాక్ గురించిన వివరాలు పరిశీలిస్తే...
 
గంధం పొడిలో చెంచా పాలు, రెండు చుక్కల తేనె కలపాలి. దీన్ని ముఖం, మెడ, చేతులకు పట్టించాలి. ఆరిన తర్వాత మృదువుగా మర్దన చేస్తూ చల్లని నీటితో కడుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మం నిగనిగలాడుతుంది. చర్మం పొడిగా ఉన్నవారికి నాలుగు చెంచాల గంధంలో, చెంచా బాదం పేస్ట్, నాలుగు చుక్కల కొబ్బరి నూనె కలిపి ముఖానికి పట్టించండి. 15 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి.
 
గంధం పొడిలో చెంచా పసుపు, కర్పూరం కలిపి ముఖానికి రాయాలి. ఇలా వారానికి మూడుసార్లు చేస్తే నల్లమచ్చలు మాయమవుతాయి. యవ్వనంగా ఉండాలంటే.. నాలుగు చెంచాల గంధం పొడిలో, రోజ్‌వాటర్, బొప్పాయి గుజ్జు, నిమ్మరసం కలిపి ముఖానికి పట్టించాలి. అరగంట తర్వాత కడిగిస్తే ముఖం ఫ్రెష్‌గా తయారవుతుంది. 
 
అలాగే, కొబ్బరినూనెలో బాదం నూనె, గంధం కలిపి నల్లగా మారి కమిలిన చర్మంపై రాయాలి. కాలుష్యం వల్ల ముఖంపై పేరుకున్న మురికి కూడా ఈ దెబ్బతో వదిలిపోతుంది. పాలతో గంధపు చెక్కను అరగదీసి ముఖానికి రాసుకుని ఆరిన తర్వాత ముఖాన్ని కడుక్కోవాలి. ఇలా చేస్తే ముఖానికి మంచి కాంతి వస్తుంది, మొటిమలు తగ్గుతాయి. స్నానం చేసే నీళ్లలో నాలుగు చుక్కల గంధపు నూనె వేయాలి. దీనివల్ల చర్మవ్యాధులు దరిచేరవు. 

ఆకాశం నుంచి చీకటిని చీల్చుకుంటూ భారీ వెలుగుతో ఉల్క, ఉలిక్కిపడ్డ జనం - video

దేశ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త - మరికొన్ని రోజుల్లో నైరుతి!

మెగా ఫ్యామిలీని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒప్పుకోను: వంగా గీత

నోరుజారిన జగన్ మేనమామ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైకాపా!!

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

Show comments